Site icon HashtagU Telugu

Yoga For Arthritis: కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌తో బాధప‌డుతున్నారా..? అయితే ఈ యోగాస‌నాలు ప్ర‌య‌త్నించండి..!

Yoga In 2026 Asian Games

Yoga For Arthritis: వయసు పెరిగే కొద్దీ కీళ్లు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. కానీ నేటి జీవనశైలి, క్రమరహిత ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా సార్లు కీళ్ల, మోకాళ్ల నొప్పులు భరించలేనంతగా తయారవుతాయి. ఆ స‌మ‌యంలో లేవడం, కూర్చోవడం లేదా నడవడం కూడా కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు ఈ సమస్యను వదిలించుకోవడానికి వివిధ చర్యలు లేదా మందులను ఆశ్రయిస్తారు. అయితే కొన్ని సులభమైన యోగాసనాల (Yoga For Arthritis) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఆస‌నాల‌ను రోజువారీ సాధన ద్వారా ఈ కీళ్ల నొప్పుల‌ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ సులభమైన యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ యోగాసనాల వ‌ల‌న నొప్పుల నుంచి ఉపశమనం

మలసానా

ఈ యోగ ఆసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడి రెండు కాళ్ల మధ్య దూరం ఉంచుతూ మీ చేతులను ప్రార్థనా భంగిమలో తీసుకోండి. ఈ స్థితిలో ఉంటూ ఇప్పుడు నెమ్మదిగా కూర్చోండి. ఊపిరి పీల్చుకుంటూ ముందుకు వంగండి. దీని తరువాత తొడల మధ్య 90 డిగ్రీల కోణంలో రెండు మోచేతులను తీసుకొని సాధారణంగా శ్వాస పీల్చుకుని సాధారణ స్థితిలో నిలబడాలి.

త్రికోణాసనం

త్రికోణాసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడి కాళ్ల మధ్య సుమారు రెండు అడుగుల దూరం ఉంచి, ఆపై లోతైన శ్వాస తీసుకుంటూ, శరీరాన్ని కుడివైపుకు వంచి, ఆపై ఎడమ చేతిని పైకి కదిలించండి. ఇప్పుడు మీ ఎడమ చేతి వేళ్లపై మీ కళ్ళు ఉంచండి. ఈ భంగిమలో కొంత సేపు ఉండి తిరిగి పాత భంగిమలోకి రండి.

Also Read: Expected Jobs: రాబోయే 7 సంవ‌త్స‌రాల‌లో 5 కోట్ల ఉద్యోగాలు..! ఏ రంగంలో అంటే..?

పూర్వోత్తనాసనం

పూర్వోత్తనాసనం చేయడానికి కుడి కాలును ముందుకు చాచి 45 డిగ్రీల కోణంలో చేసి ఆపై ముందుకు వంగి, చేతులను నేలపై ఉంచండి. దీని తర్వాత మోకాళ్లను వంచకుండా కొంతసమయం పాటు ఈ స్థితిలో ఉండి. సాధారణ స్థితికి రావాలి.

We’re now on WhatsApp : Click to Join

గరుడాసనం

గరుడాసనం చేయడానికి తాడాసనంలో నిలబడి ఆపై మీ మోకాళ్లను వంచి, ఎడమ కాలును పైకెత్తి కుడి కాలుపై తిప్పండి. అలాగే కుడి పాదాన్ని నేలపై ఉంచి ఎడమ తొడ కుడి తొడ పైన ఉండేలా ఎడమ పాదం కాలి వేళ్లు నేల వైపు ఉండేలా చూసుకోవాలి.