World Unani Day 2024 : ఇవాళ (ఫిబ్రవరి 11) ప్రపంచ యునానీ దినోత్సవం. ఢిల్లీకి చెందిన సంఘ సంస్కర్త, సుప్రసిద్ధ యునానీ పండితుడు హకీమ్ అజ్మల్ ఖాన్ జయంతి సందర్భంగా ప్రపంచ యునానీ దినోత్సవాన్ని ఏటా ఇదే రోజున జరుపుకుంటారు. 1868 ఫిబ్రవరి 11న జన్మించిన హకీమ్ అజ్మల్ ఖాన్ ప్రముఖ యునానీ వైద్యుడు మాత్రమే కాదు.. భారతదేశంలో యునాని వైద్య విధానాన్ని(World Unani Day 2024) ఆధునికీకరించిన ఘనుడు. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులలో అజ్మల్ ఖాన్ ఒకరు. ఈయన ఢిల్లీలో ఆయుర్వేద, యునాని టిబ్బియా కళాశాలను స్థాపించారు. కరోల్ బాగ్‌లో ఉన్న ఈ కాలేజీ.. టిబ్బియా కళాశాలగా చాలా ఫేమస్. మన దేశంలో అప్పట్లో హిందూ మహాసభలకు అధ్యక్షత వహించిన ఏకైక ముస్లిం రాజకీయనాయకుడు అజ్మల్ ఖానే కావడం గమనార్హం. ఆయన 1920లో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మొదటి ఛాన్సలర్ అయ్యారు. 1927 డిసెంబరు 29న మరణించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
We’re now on WhatsApp. Click to Join
యునాని వైద్యం ఆసక్తికర విశేషాలు
- యునానిమెడిసిన్స్‌ను యునాని టిబ్, అరేబియా ఔషధం లేదా ఇస్లామిక్ ఔషధం అని కూడా పిలుస్తారు. పురాతన గ్రీకు తత్వశాస్త్రంలోనూ దీని గురించి ప్రస్తావన ఉంది.
- అరబిక్ భాషంలో ‘యునాని’ అంటే ‘గ్రీకు’ అని అర్ధం అంటే గ్రీస్ దేశంలో పుట్టిందే యునానీ వైద్యమన్న మాట.
- యునానీ వైద్యశాస్త్రం నాలుగు ప్రాథమిక మూలకాల చుట్టూ తిరుగుతుంది. అగ్ని, నీరు, గాలి, భూమిలకు అనుగుణంగా.. కఫం, నల్ల పిత్తం, రక్తం, పసుపు పిత్తంలపై పనిచేసేలా యునానీ ఔషధాలు ఉంటాయి.
- భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2016 సంవత్సరం నుంచి ప్రపంచ యునానీ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీని వేడుకలను మొదట హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్‌లో 2017 సంవత్సరంలో నిర్వహించారు. భారతదేశంలో యునాని వైద్య వ్యవస్థ నిర్మాణానికి హకీమ్ అజ్మల్ ఖాన్ చేసిన సేవలను ఏటా ఈ రోజున గుర్తు చేసుకుంటారు.
Also Read : Farmers Protest : మోడీకి మరో పరీక్ష.. లక్షలాది రైతన్నల ‘చలో ఢిల్లీ’
సూర్యకాంతి నీటి ద్వారా..
ఆయుర్వేద శాస్త్రానికి అనేక శతాబ్దాల చరిత్ర ఉంది. ఆయుర్వేద జీవన విధానాన్ని అనుసరించడం వల్ల మన ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవచ్చు. నీటిని ఎండలో ఆరబెట్టి తాగడం అలాంటి పద్ధతి. సూర్యరశ్మి నీటిపై పడినప్పుడు అందులోని మృతకణాలు పునరుద్ధరించబడి జీవజలంగా మారుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఆయుర్వేదం అంటే ‘సూర్యోదయం’. అంటే సూర్యకాంతి ద్వారా నీరు శుద్ధి అవుతుంది. మీరు ఏ రకమైన సీసాలో నీరు నింపి ఎండలో వేడవ్వనివ్వాలి. అది వేడెక్కుతుంది ,దాని శక్తిని తిరిగి పొందుతుంది. సూర్యకాంతి నుంచి వచ్చే UV కిరణాల వల్ల నీటిలో సూక్ష్మజీవులు తగ్గిపోతాయి. సూర్యకాంతి నీటి ద్వారా మీ శరీరంలో శక్తిని పెంచుతుంది. శరీరంలో వాపు తగ్గుతుంది.
సూర్యకాంతి నీటి ప్రయోజనాలు..
- ఎండలో వేడి చేసిన నీటిని తాగితే శక్తి పెరుగుతుంది.
- మీ శరీరంలో నూతనోత్తేజం పెరుగుతుంది.
- కణాలకు మీరు చేసిన నష్టాన్ని ఇది సరిచేస్తుంది.
- సూర్యకాంతి నీటిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి, కళ్ళను శుభ్రం చేయడానికి అనువైనది.
- సూర్యరశ్మి తాగే నీరు మీ జీర్ణ శక్తిని మెరుగుపరిచే ,ఆకలిని ప్రేరేపించే శక్తిని కలిగి ఉంటుంది. పేగుల్లోని నులిపురుగులను నశింపజేసి ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలను సరిచేస్తుంది.
- చర్మం మంటను నియంత్రిస్తుంది, దురదను నయం చేస్తుంది. దీని వల్ల మెరిసే చర్మం వస్తుంది.