World Toilet Day 2025: ప్రతి సంవత్సరం నవంబర్ 19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం (World Toilet Day 2025) జరుపుకుంటారు. ఈ రోజున మరుగుదొడ్ల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. టాయిలెట్‌ను ప్రతీ గంట శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మీరు అలా చేయకపోతే ఇంట్లో అనేక రకాల వ్యాధులు వ్యాపించవచ్చు. మరుగుదొడ్లలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మన చెప్పుల ద్వారా ఇంటి లోపలికి ప్రవేశిస్తాయి. దీని ప్రభావం ఎక్కువగా పిల్లలపై ఉంటుంది. కాబట్టి మరుగుదొడ్ల శుభ్రతపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం.
టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచడానికి మీరు టాయిలెట్ క్లీనర్, మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించడం, టాయిలెట్ ట్యాబ్లెట్ లేదా ఫ్రెషనర్ వంటివి వాడవచ్చు. అలాగే మేము చెప్పే చిట్కాలను పాటించడం ద్వారా కూడా టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచుకోవచ్చు.
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
నేడు అంటే నవంబర్ 19న ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం జరుపుకుంటారు. ఇది ఒక రకమైన గ్లోబల్ ఈవెంట్. ఇందులో పారిశుద్ధ్య సంక్షోభాన్ని తగ్గించడంపై చర్చిస్తారు. మరుగుదొడ్ల శుభ్రతపై ప్రజలు దృష్టి సారించాలని 2013లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా ప్రారంభించింది.
Also Read: Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మకు భారీ నష్టం!?
మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచే చిట్కాలు
నియమం పెట్టుకోండి: టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచడానికి ఒక నియమాన్ని రూపొందించండి. తద్వారా ఇంట్లో అందరూ దానిని పాటించి, మరుగుదొడ్లను అపరిశుభ్రం చేయకుండా చూస్తారు.
నాణ్యమైన వస్తువులు వాడండి: శుభ్రత కోసం మంచి బ్రష్‌లు, మంచి టాయిలెట్ క్లీనర్లు, మంచి పేపర్ (టిష్యూ) వంటి వాటిని ఉపయోగించండి.
దుర్వాసన దూరం: మరుగుదొడ్డి నుండి దుర్వాసన రాకుండా ఉండటానికి మీరు ఫ్లష్ ట్యాంక్ లోపల బ్లీచ్ టాబ్లెట్‌ను వేయవచ్చు.
సీటు శుభ్రత: సీటును శుభ్రం చేయడానికి కాటన్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌ను ఉపయోగించండి.
రోజంతా టాయిలెట్‌ను బ్యాక్టీరియా నుండి ఎలా దూరంగా ఉంచాలి?
కవర్ మూయండి: శుభ్రంగా ఉన్న టాయిలెట్ సీటుపై కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. అందుకే ఫ్లష్ చేసేటప్పుడు టాయిలెట్ మూత కచ్చితంగా మూసివేయండి.
చేతులు శుభ్రం: టాయిలెట్‌ను తాకడానికి ముందు, తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. తద్వారా మురికి తొలగిపోతుంది.
చెప్పులు మార్చండి: టాయిలెట్ లోపల బయటి చెప్పులు తీసుకువెళ్లవద్దు. ఎందుకంటే దీనివల్ల మురికి బ్యాక్టీరియాలు ఇంటి అంతటా వ్యాపించవచ్చు.
టాయిలెట్‌ను సువాసనభరితంగా ఎలా మార్చాలి?
లావెండర్ ఆయిల్: సువాసన కోసం మీరు లావెండర్ నూనెను ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు ఒక కాటన్ బాల్ తీసుకుని.. నూనెలో ముంచి టాయిలెట్ దగ్గర ఉంచాలి. మీరు ఆ నూనెను గోళీలా చేసి కూడా వాడుకోవచ్చు.
