World Spine Day 2024: ఇవాళ (అక్టోబరు 16) ప్రపంచ వెన్నెముక దినోత్సవం. మనం సరిగ్గా నిలబడాలంటే వెన్నెముక బలంగా ఉండి తీరాల్సిందే. మనకు వయసు పెరిగే కొద్దీ వెన్నెముక బలహీనపడి వంగిపోతుంటుంది. కంప్యూటర్‌పై నిత్యం వంగి పనిచేసే వారిలో మెడనొప్పి సమస్యలు వస్తున్నాయి. దీన్నే వైద్యభాషలో టెక్ నెక్ అని పిలుస్తారు. రోడ్డు ప్రమాదాల బారినపడటం వల్ల కూడా కొందరిలో వెన్ను నొప్పి మొదలవుతుంది. సాధారణంగా వెన్ను నొప్పి మొదలైతే రోజంతా కంటిన్యూ అవుతుంది. అయితే కొందరిలో రాత్రి మాత్రమే వెన్ను నొప్పి ఉంటుంది. వెన్నెముకకు జరిగిన నష్టం తీరును బట్టి నొప్పి(World Spine Day 2024) తీవ్రత ఉంటుంది.
Also Read :Imran Khan: ఇమ్రాన్ ఖాన్.. ఇద్దరు కొడుకులు.. మాజీ భార్య గోల్డ్‌స్మిత్ సంచలన ట్వీట్
వెన్నునొప్పి గురించి ఇవి తెలుసుకోండి
- వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య డిస్క్ కార్టిలేజ్ ఉంటుంది. మనకు వయసు పెరిగే కొద్దీ డిస్క్ కార్టిలేజ్‌లో నీరు, ప్రొటీన్‌ల మోతాదు తగ్గిపోతుంది. దీనివల్ల వెన్నుపూసల నుంచి బయటకు వచ్చే నాడులు ఒత్తిడికి గురై వెన్నునొప్పి మొదలవుతుంది.
- వీపు దిగువ భాగంలోని కండరాలు విపరీతంగా అలసిపోతే వెన్ను నొప్పి మొదలవుతుంది. వీపు దిగువనున్న కండరాల వల్లే మన వెన్ను, వీపు నిలకడగా ఉంటాయి. ఒకవేళ ఈ కండరాలు అలసిపోతే వాటిపై ఒత్తిడి పెరిగి వెన్నునొప్పికి దారితీస్తుంది.
- చేతులు, కాళ్లు, గజ్జలలో తరుచుగా తిమ్మిర్లు వస్తుంటే వెన్నుపాముకు కొంత నష్టం జరిగిందని గుర్తించాలి. ఇలాంటప్పుడు సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి.
- నడుము నుంచి ముందుకు వంగినప్పుడు వెన్నునొప్పి ఎక్కువగా ఉంటే దాన్ని హెర్నియేటెడే డిస్క్ సమస్యగా పిలుస్తారు.
- వెన్నునొప్పితో పాటు మూత్ర విసర్జనలో మంట కలిగితే వెన్ను నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ సోకినట్లుగా మనం భావించాలి. వైద్యుడిని సంప్రదించాలి.
- వెన్ను నొప్పి కాలు వెనుక భాగం మీదుగా కిందికి వ్యాపిస్తుంటే ఆ సమస్యను సయాటికా అని పిలుస్తారు.
- మన వీపులో పేలవమైన భంగిమ వల్ల స్పాండిలైటిస్ సమస్య వస్తుంది. దీనివల్ల వెన్నెముకలో వాపు వస్తుంది.
- మెడ, వెన్ను అదేపనిగా ముందుకు వంగిపోయినట్టయితే శరీర భంగిమ దెబ్బతిని రకరకాల సమస్యలు వస్తాయి.