World Polio Day 2024: నేడు (అక్టోబర్ 24న) ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రపంచ పోలియో దినోత్సవం (world polio day 2024). ప్రపంచ పోలియో దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న నిర్వహించబడుతుంది. ఇది పోలియో వ్యాధి, దాని ప్రభావం మరియు అంతర్జాతీయ స్థాయిలో వ్యాధిని నిర్మూలించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన పెంచేందుకు కార్యక్రమం.
ఈ రోజు పిల్లలను పోలియో నుండి రక్షించే వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను తెలియపరుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పోలియో నిర్మూలనపై ఉన్న పురోగతిని నేడు గుర్తు చేస్తూ వస్తుంది. అనేక దేశాలలో ఈ సందర్భంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహనా తెస్తుంటారు. పోలియో బాధితుల కధలు మరియు వ్యాక్సినేషన్ ముఖ్యమైనదనే అవగాహన పెంచే కార్యక్రమాలు జరుగుతాయి.
పోలియో అనే పదం పోలియోమైలిటిస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. పోలియో అంటే బూడిద.’మైలోన్’ అంటే మజ్జ. ఎముక మజ్జలో ఈ వ్యాధి మొదలవుతుంది కాబట్టి దీనిని పోలియోవైరస్ లేదా పోలియోమైలిటిస్. వెన్నెముక్క, మెదడు కాండంలోని నరాలపై దీని ప్రభావం ఉంటుంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి అవయవాలను కదపలేక పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం,కొన్నిసార్లు ఇది తీవ్ర స్థాయికి చేరి మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. పోలియోమైలిటిస్ ముదిరితే పక్షవాతం అవుతుంది. ఇది ఒక ప్రాణాంతక అంటువ్యాధి. వయసుతో నిమిత్తం లేదు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలపై దీని ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది.
మొదటి రకం అబార్టివ్ పోలియో మైలిటిస్ (Abortive poliomyelitis)
రెండవ రకం పెరాలిటిక్ పోలియోమైలిటిస్ (Paralytic poliomyelitis).
అబార్టివ్ పోలియోమైలిటిస్ (Abortive poliomyelitis) :
అబార్టివ్ పోలియోమైలిటిస్ లక్షణాలు: జ్వరం, అలసట, వికారం, తలనొప్పి, ముక్కుదిబ్బడ, గొంతునొప్పి, దగ్గు, మెడ పట్టడం, శరీరంలోని భాగాల నొప్పి వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు మందుల ద్వారా నయం కావచ్చు.
అబార్టివ్ పోలియోమైలిటిస్ ప్రభావం: ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపదు, కాబట్టి ఇది తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది.
పెరాలిటిక్ పోలియోమైలిటిస్ (Paralytic poliomyelitis)
పెరాలిటిక్ పోలియోమైలిటిస్ లక్షణాలు: ఇది చాలా కఠినమైనది మరియు నాడీ వ్యవస్థపై నేరుగా దాడి చేస్తుంది. శ్వాసకోశ కండరాలను ప్రభావితం చేయడం, మెదడు ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వంటి పరిస్థితులు జరిగితే, శాశ్వత నష్టం కలిగించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది.
వైరస్ పరిణామం: కొందరికి పోలియో వైరస్ లక్షణాలు లేకుండా సోకే అవకాశం ఉంటుంది, కానీ వారు శాశ్వత వైకల్యానికి గురవుతారు.
పోలియో టీకా :
పోలియో వైరస్ ప్రభావం: పోలియో వైరస్ పిల్లల పేగులపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, అన్ని పిల్లలకు ఒకే రోజు పోలియో టీకా ఇవ్వడం జరుగుతుంది, ఇది వ్యాధికారక వైరస్‌లను నాశనం చేస్తుంది.
ప్రస్తుత పరిస్థితి: పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ నుండి ఇతర దేశాలకు పోలియో వైరస్ వ్యాప్తి జరుగుతున్నందున, భారతదేశంలో పోలియో నిర్మూలన కార్యక్రమం కొనసాగుతోంది. 2005 నుండి 2011 వరకు నమోదైన కేసులు శ్రేణిగా ఉన్నాయి, చివరిగా 2011లో ఒక 2 సంవత్సరాల బాలికకు కేసు నమోదైంది.
పోలియో వ్యాక్సిన్ చరిత్ర చూస్తే..
జోనాస్ సాల్క్: 1952లో పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నారు మరియు 1955లో దాన్ని ప్రకటించారు. ఇది ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే టీకా.
ఆట్బర్ట్ సబైన్: 1957లో నోటి టీకా కనుగొనబడింది, ఇది 1962లో లైసెన్స్ పొందింది. ఈ టీకా పిల్లలకు 5 సంవత్సరాల వరకు ఇస్తారు.