World Polio Day 2023 : పోలియో (Polio) మహమ్మారి ఈ పేరు వింటేనే ఒకప్పుడు భయపడేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు కాస్త మారాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ మహమ్మారి కనుమరుగై పోయింది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం ఇంకా ఈ మహమ్మారి వెంటాడుతూనే ఉంది. పోలియో బారినపడితే కాళ్ళు, చేతులు చచ్చు పడతాయి. జీవితాంతం వారు అలాగే బాధపడుతూ ఉండాలి. 1955 లో పోలియో వాక్సిన్ (Polio Vaccine) ను కనుగొన్నారు.
పోలియో (Polio ) అనేది 5 ఏళ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి రెండు రకాలుగా సంభవిస్తుంది. అశుభ్రమైన ఆహారం తినడంవల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. మరొక విధం ఏమిటంటే – ఈ వ్యాధి క్రిములు గొంతులో ప్రవేశించడం మూలాన రోగి బాధపడతాడు. కడుపులో ప్రవేశించిన క్రిములు, రోగి మలంలో ఎక్కువగా బహిర్గతం అవుతాయి. అశుభ్రమైన ఆహార పానీయాదుల వల్ల చేతులూ కాళ్ళూ సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఈ వ్యాధి రావచ్చు. ఇలా రెండు రకాలుగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. పోలియో అంటే బూడిద.’మైలోన్’ అంటే మజ్జ. ఎముక మజ్జలో ఈ వ్యాధి మొదలవుతుంది కాబట్టి దీనిని పోలియోవైరస్ లేదా పోలియోమైలిటిస్. వెన్నెముక, మెదడు కాండంలోని నరాలపై దీని ప్రభావం ఉంటుంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి అవయవాలను కదపలేక పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం,కొన్నిసార్లు ఇది తీవ్ర స్థాయికి చేరి మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. పోలియోమైలిటిస్ ముదిరితే పక్షవాతం అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి పోలియో ఇతర దేశాలకు వైరస్ వ్యాప్తి దృష్ట్యా భారత్ పోలియో నిర్మూలన కార్యక్రమం ఇప్పటికీ కొనసాగిస్తుంది. భారత్లో 2005లో 66, 2006లో 676, 2007లో 874, 2008లో 559, 2009లో 741, 2010లో 42, 2011లో 1 కేసులు నమోదయ్యాయి. చివరిగా 2011 జనవరి 13న రెండేళ్ల బాలికకు ఈ వ్యాధి వచ్చింది. పోలియో వ్యాక్సిన్‌ను జోనాస్ సాల్క్ 1952లో కనుగొన్నారు. కానీ 1955 ఏప్రిల్ 12 దీనిని ప్రకటించారు. ఆతర్వాత నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇది ఒక టీకా. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేది. జోనాస్ తర్వాత ఆట్బర్ట్ సబైన్ నోటి టీకాను కనుగొన్నారు. 1957లో ఈ నోటి టీకాను మానవుల మీద ప్రయోగించేందుకు అనుమతి లభించింది. ఇది 1962లో లైసెన్స్ పొందింది. అప్పటి నుంచి దీనిని పిల్లలకు ఇస్తూనే వస్తున్నారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఐదేళ్ళు వచ్చేవరకు ఈ నోటి టీకాను ఇస్తారు. ప్రాణాంతక, నివారణలేని వ్యాధికి మందు కనిపెట్టిన జోనాస్ సాల్క్ పుట్టినరోజు సందర్భంగానే అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకోవాలని డబ్ల్యుహెచ్‌ఒ, గ్లోబల్ కమ్యూనిటీ కలసి నిర్ణయించాయి. అప్పటి నుండి ప్రతి ఏడాది అక్టోబర్ 24 న ప్రపంచ పోలియో దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈరోజు పోలియో ఫై ప్రజల్లో మరింత అవగాహనా తీసుకరావడం..పోలియో వస్తే ఎలా ఉంటుంది..? పోలియో రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? పోలియో ను ఎవరు ఎప్పుడు కనుగొన్నారు..? ఎప్పటి నుండి ఇది అమల్లోకి వచ్చింది..? వంటివి తెలియజేస్తుంటారు.
Read Also : SBI PO Admit Card: SBI PO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!