Site icon HashtagU Telugu

World Mental Health Day: ప్రతి 8 మందిలో ఒకరు డిప్రెషన్…ప్రతి ఏడాది మిలియన్ల మంది సూసైడ్…!!

World Mental

World Mental

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోవత్సవాన్ని ప్రతిఏడాది అక్టోబర్ 10న జరుపుకుంటారు. కోవిడ్ మహ్మరి ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ దేశంలో మానసిక ఆరోగ్యంపై తక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం…ప్రపంచవ్యాప్తంగా ప్రతి 8 మందిలో ఒకరు మానసిక రుగ్మతకు గురవుతున్నారు. ప్రజలు మానసిక ఆరోగ్యం కోసం అందుబాటులో ఉన్న సేవలు, నైపుణ్యాలు, నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుున్నారు.

మానసిక ఒత్తిడి ఆత్మహత్యలకు ప్రధాన కారణం. డబ్య్లూహెచ్ ఓ నివేధిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల 3వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 58శాతం మంది 50ఏళ్లకు పైబడినవారే. 20ఏళ్ల నుంచి 35ఏళ్లలోపు యువత అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. వీరి సంఖ్య 60వేలకు పైగానేఉంది. వీరిలో న్యాయవాధులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన యువతే ఎక్కువగా ఉన్నారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ చరిత్ర.
WFMHను అధికారికంగా 90లలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 10న జరుపుకుంటున్నారు. WHOప్రకారం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ వరల్ల్ మెంటల్ హెల్త్ థీమ్ ను అక్టోబర్ 10, 2022న మేక్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఏ గ్లోబల్ ప్రయార్టీగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ ఏడాది డబ్ల్యూహెచ్ ఓ భాగస్వాముల సహకారంతో మేక్ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఎ గ్లోబల్ ప్రయారటీ ప్రచారాన్ని ప్రారంభించబోతోంది. మానసిక ఆరోగ్య పరిస్థితులు, న్యాయవాదులు, ప్రభుత్వాలు, ఉద్యోగులు, మానసిక ఆరోగ్యం, ఆరోగ్యాన్ని ప్రధాన స్రవంతిలో ఉంచడమే లక్ష్యంగా పేర్కొన్నారు.

మానసిక ఒత్తిడిని ఎలా తొలగించాలి?
-మిమ్మల్ని మీరు అధిగమించనివ్వద్దు
-ఒత్తిడి లేకుండా ఉండేందుకు మీకు ఇష్టమైన పని చేయండి
-మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా, వ్యాయామం చేయండి.
-చిన్నపాటి సమస్య వచ్చినా డాక్టర్ తో మాట్లాడండి.