Monkey Pox : ప్ర‌పంచంపై కోవిడ్ కంటే డేంజ‌ర్ వైర‌స్

ప్ర‌పంచాన్ని కోవిడ్ త‌ర‌హా మ‌రో విప‌త్తు మంకీ పాక్స్‌ రూపంలో వ‌స్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య నెట్ వ‌ర్క్ ప్ర‌క‌టించింది.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 04:31 PM IST

ప్ర‌పంచాన్ని కోవిడ్ త‌ర‌హా మ‌రో విప‌త్తు మంకీ పాక్స్‌ రూపంలో వ‌స్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య నెట్ వ‌ర్క్ ప్ర‌క‌టించింది. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ప్రాణ‌న‌ష్టంతో పాటు అంగ‌విక‌లాంగులు అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. మంకీపాక్స్ అనేది తీవ్రమైన బాధాకరమైన అనారోగ్యంతో పాటు గణనీయమైన హాని కలిగించే అవకాశం ఉన్న వైరస్ గా (WHN) గుర్తించింది. మంకీఫాక్స్ అనుమానం రాగానే ఆసుపత్రిలో చేరడం అవసరమ‌ని తేల్చింది. మరణం, చర్మపు మచ్చలు, అంధత్వం ఇతర దీర్ఘకాలిక వైకల్యానికి ఈ వైర‌స్ కార‌ణం కావ‌చ్చొని ప్ర‌క‌టించింది. పిల్లలు, గర్భిణీలు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు ఈ వైర‌స్ అత్యంత హాని కలిగిస్తుంద‌ని (WHN) సూచించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 42 దేశాలలో 3,417 మందికి సోకింద‌ని గురువారం ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ ప్రకటించింది. అంతేకాదు, కోవిడ్ కంటే అత్యంత ప్ర‌మాద‌మైన మ‌హ‌మ్మారిగా తెలియ‌చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కంటే ముందే ఈ ప్రకటన వచ్చింది. మంకీపాక్స్ వ్యాప్తికి సంబంధించిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ప్ర‌పంచ దేశాల‌ను ఆదేశించింది. ఇన్ఫెక్షన్ కేసులను స‌రైన సమయంలో ట్రాక్ చేసే వెబ్‌సైట్ Monkeypoxmeter ను ఉటంకిస్తూ, ఇప్పుడు 58 దేశాలలో 3,417 ధృవీకరించబడిన మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్ర‌క‌టించింది. ఈ వైర‌స్ వ్యాప్తి బహుళ ఖండాలలో వేగంగా విస్తరిస్తోంద‌ని WHN హెచ్చ‌రించింది.

మంకీపాక్స్ విపత్తుగా మారకుండా తక్షణ చర్య తీసుకోవాలని WHN, WHO సంయుక్తంగా నేషనల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆర్గనైజేషన్స్ ను కోరింది. మశూచి కంటే మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ వేగ‌వంత‌మైన‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్త చర్యలు తీసుకోవాల‌ని సూచించింది. లేదంటే, ఈ వైర‌స్ లక్షలాది మంది ప్రాణాల‌ను తీయ‌డ‌మే కాకుండా అంధులను మరియు వికలాంగులను చేస్తుందని హెచ్చ‌రించింది.

“WHO తన స్వంత పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ (PHEIC)ని అత్యవసరంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. జనవరి 2020 ప్రారంభంలో PHEICని (కోవిడ్-19) వెంటనే ప్రకటించకపోవడం అనే పాఠాలు నేర్చుకున్న విష‌యాన్ని గుర్తు చేసింది. ఒక అంటువ్యాధిపై ఆలస్యంగా వ్యవహరిస్తే వ‌చ్చే అపార‌న‌ష్టం కోవిడ్ తెలియ‌చేసింది. దాన్ని పాఠంగా గుర్తుంచుకోవాల‌ని ఎరిక్ ఫీగల్-డింగ్, PhD, ఎపిడెమియాలజిస్ట్ మరియు హెల్త్ ఎకనామిస్ట్ మరియు WHN సహ వ్యవస్థాపకుడు ఒక ప్రకటనలో తెలిపారు.

“మంకీపాక్స్ మహమ్మారి లక్షణాల గురించి స్పష్టమైన పబ్లిక్ కమ్యూనికేషన్ అవసరం. విస్తృతంగా అందుబాటులో ఉన్న పరీక్షలు, చాలా తక్కువ క్వారంటైన్‌లతో కాంటాక్ట్ ట్రేసింగ్ అవసరం. ఏదైనా ఆలస్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, ”అని న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్ సిస్టమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్ మరియు WHN సహ వ్యవస్థాపకుడు యనీర్ బార్-యామ్, PhD హెచ్చ‌రించారు.

ఇప్పటి వరకు చాలా కేసులు పెద్దవారిలో ఉన్నాయి. ఒక వేళ‌ పిల్లలలో వ్యాప్తి తీవ్రమైతే మరణాలకు దారి తీస్తుంది. ఎలుకలు , పెంపుడు జంతువులకు ఈ వైర‌స్ సోకితే వ్యాప్తిని ఆప‌డం చాలా కష్టతరం చేస్తుంది. అందుకే, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌పంచ దేశాల‌ను WHN అప్ర‌మ‌త్తం చేసింది.