డయాబెటిస్, షుగర్, మధుమేహం…పేర్లు వేరే అయినా జబ్బు మాత్రం ఒక్కటే. ఒక్కసారి వచ్చిందంటే దీన్ని నయం కాదు. ఆహారం, జీవనశైలి ద్వారా కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించడంలో ఆయుర్వేదం పెద్ద పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈమధ్యకాలంలో ప్రతి నలుగురిలో ముగ్గురు షుగర్ బారినపడుతున్నారు. షుగర్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారు దీని బారిన పడుతున్నారు. కారణం మారుతున్న జీవన శైలి అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి తన ఆహారం, జీవనశైలిని సకాలంలో మెరుగుపరుచుకున్నట్లయితే…షుగర్ ను నివారించే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది.
అయితే ఇప్పుడు కొన్ని ఆయుర్వేద ఔషధం లేదా ఉపాయాల గురించి తెలుసుకుందాం. వీటి ద్వారా ఎలాంటి హాని కలగదు. ప్రస్తుతం రెండు రకాల మధుమేహం ప్రజలలో వేగంగా వ్యాపిస్తోంది. వాటిలో టైప్ 1 టైప్ 2. ఈ డయాబెటిస్ మీ శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్ శరీరంలోని కణాలు ఇన్సులిన్ ను ఉపయోగించలేవు.
ఉసిరి, జామున్ గింజలు, కాకరకాయ రసం ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడానికిచాలా ఉపయోగరంగా ఉంటాయి. టైప్ 1, టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకకరకాయ రసాన్ని తాగవచ్చు. దీన్ని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది.
డయాబెటిక్ పేషంట్లకు ఆరోగ్యకరమైన ఆహారంచాలా అవసరం. మందులతోపాటు ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే మొదటి దశలోనే దీన్ని కంట్రోల్ చేయవచ్చు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. ఈ డైట్ లో రక్తంలో చక్కెరను తగ్గించే ఆహారాలు ఉంటాయి. ఇందులో అధిక కొవ్వు, పిండిపదార్థాలు, చక్కెర సంబంధిత పదార్థాలు ఉండవు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, విత్తనాలు వంటి ఆరోగ్య ప్రయోజనకరమైన ఆహార పదార్ధాలు మాత్రమే ఉంటాయి.
డయాబెటిక్ రోగులు రోజుకు 24గంటల్లో 1గంట తప్పనిసరిగా వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమ మధుమేహం ముప్పును తగ్గిస్తుంది. ఊబకాయం, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత జబ్బులను నుంచి కాపాడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. డయాబెటిక్ పేషంట్లు ఒత్తిడికి దూరంగా ఉండాలి. జీవనశైలిలో ధ్యానాన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ రెండు అలవాట్లు మీ రక్తంలో చక్కెర స్థాయిన అదుపులో ఉంచడంలో మీకు సహాయపడతాయి.