World AIDS Day: ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (World AIDS Day) అనేది హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) కారణంగా వస్తుంది. HIV శరీరంలోని రోగ నిరోధక శక్తిని క్రమంగా నాశనం చేస్తుంది. దీని వలన వ్యక్తి సులభంగా, వేగంగా వ్యాధుల బారిన పడతారు. వచ్చిన రోగాలు అంత తేలికగా నయం కావు. కాబట్టి సకాలంలో AIDSను గుర్తించి చికిత్స అందించడం చాలా ముఖ్యం. తద్వారా ఆ వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపవచ్చు. AIDS గురించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలు ఈ వ్యాధి గురించి మాట్లాడటానికి కూడా సంకోచిస్తారు. ఈ సంకోచాన్ని తొలగించడానికి, AIDS పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ AIDS దినోత్సవం నిర్వహించబడుతుంది.
AIDS సోకినప్పుడు చాలా మంది వ్యక్తులు ప్రారంభ లక్షణాలను గుర్తించలేకపోవడం వలన వ్యాధి నిర్ధారణ అయ్యే సమయానికి సమస్య తీవ్రమవుతుంది. నిపుణులు అందించిన వివరాల ప్రకారం.. AIDS ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: MS Dhoni: రాంచీలో జరిగిన మ్యాచ్‌కు ధోని ఎందుకు రాలేకపోయాడు? కారణమిదేనా?!
AIDS ప్రారంభ లక్షణాలు
ఎయిడ్స్ సోకినప్పుడు శరీరంలో కనిపించే ప్రారంభ లక్షణాలు ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. AIDS సోకినప్పుడు కనిపించే మొదటి లక్షణాలలో ఒకటి నాలుకపై తెల్లటి పూత ఏర్పడటం. ఇది సులభంగా పోదు లేదా తొలగించబడదు. తరచుగా వ్యక్తి బరువు తగ్గడం అనేది AIDS మరొక లక్షణం. తరచుగా జ్వరం రావడం, వాంతులు, విరేచనాలు (డయేరియా) వంటి సమస్యలు ఉండటం కూడా ప్రారంభ లక్షణాలలో ఒకటి. HIV సోకినప్పుడు జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. కడుపు సంబంధిత సమస్యలు మొదలవుతాయి. HIV ప్రారంభ లక్షణాలలో పదేపదే అలసటగా అనిపించడం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాదాల అరికాళ్ళపై చెమటలు పట్టడం మొదలవుతుంది. ఆందోళన అనుభూతి చెందుతారు.
AIDS లక్షణాలు కనిపిస్తే ఏమి చేయాలి?
మీ శరీరంలో పైన పేర్కొన్న AIDS లక్షణాలు కనిపిస్తే త్వరగా దానిని నిర్ధారించుకోవడానికి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అసురక్షిత లైంగిక సంబంధం లేదా సూది ద్వారా ఏదైనా ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.
