Health Tips: నైట్ డ్యూటీలు ఎక్కువగా చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

ప్రతిరోజుల్లో చాలామంది డే టైం డ్యూటీలతో పాటుగా కొన్ని నైట్ షిఫ్ట్ లలో కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మంచి సంపాదన ఉండాలని, అప్పులు చేయకూడదని చాలా

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 01:45 PM IST

ప్రతిరోజుల్లో చాలామంది డే టైం డ్యూటీలతో పాటుగా కొన్ని నైట్ షిఫ్ట్ లలో కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మంచి సంపాదన ఉండాలని, అప్పులు చేయకూడదని చాలామంది రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతుంటారు. కష్టపడడం మంచిదే కానీ ఇలా రాత్రి పగలు ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్ర మేలుకొని డ్యూటీలు చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎక్కువ కాలం ఇలా నైట్ షిఫ్ట్ చేస్తే ఏం జరుగుతుందో,నిపుణులు ఈ విషయం గురించి ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వరుసగా మూడు రోజులు నైట్ షిఫ్ట్ చేసినా కూడా ఊబకాయం, షుగర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కాగా మన శరీరం సిర్కాడియన్ రిథమ్ అని పిలువబడే సహజమైన జీవసంబంధమైన లయను కలిగి ఉంటుంది. ఇది శరీర అంతర్గత గడియారంలో భాగమైన 24 గంటల చక్రం, అవసరమైన విధులు , ప్రక్రియలను నిర్వహించడానికి నేపథ్యంలో నడుస్తుంది. నైట్ షిప్ట్స్ లో పని చేయడం వల్ల ఆ సమస్యలన్నీ తారుమారు అయిపోతాయట. అయితే రాత్రి పూట పని చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందట. నిద్ర అలవాట్లలో మార్పులు రక్తపోటు , ప్రసరణను ప్రభావితం చేస్తాయట.

అలాగే ఇవి హృదయ సంబంధ వ్యాధుల సంభావ్యతను కూడా పెంచుతాయని చెబుతున్నారు. రాత్రి షిఫ్టులో పనిచేయడం వల్ల శారీరకంగా , మానసికంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. రాత్రిపూట డ్యూటీలు చేసేవారు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడవచ్చని చెబుతున్నారు. కంటి నిండా సరైన నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్ ఆందోళన ఒత్తిడి, తలనొప్పి బండి సమస్యలు వస్తాయట. రాత్రి షిఫ్ట్‌లో పనిచేయడం వల్ల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది, ఇది శరీరం సహజ సిర్కాడియన్ రిథమ్‌ను ప్రభావితం చేస్తుందట.

ఇలా రాత్రిపూట ఎక్కువసేపు మేలుకోవడం వల్ల సరిగా తిండి తినక తిన్న ఆహారం శరీరానికి పట్టక విపరీతంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. రాత్రి షిఫ్ట్ పని శరీరం సిర్కాడియన్ రిథమ్‌పై వినాశనం సృష్టిస్తుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడానికి దారితీస్తుందట. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ప్రకారం, రాత్రి షిఫ్టులలో పనిచేసే వారు అధిక కేలరీలు , అనారోగ్యకరమైన ఆహారాలు అంటే నామ్‌కీన్, సమోసా, చైనీస్ ఫుడ్, వడ, బర్గర్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా కోలాస్ వంటి వాటిని కలిగి ఉంటారట. దాంతో బరువు విపరీతంగా పెరిగిపోతారట.

Follow us