Site icon HashtagU Telugu

Coriander Leaf: వామ్మో.. కొత్తిమీర వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలా?

Coriander

Coriander

వంటింట్లో దొరికే ఆకుకూరల్లో కొత్తిమీర కూడా ఒకటి. దాదాపు అన్ని రకాల కూరలలో కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. కూరలలో కొత్తిమీరను వేయడం వల్ల కూరకు రుచిని మరింత పెంచుతుంది. కొత్తిమీర వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలామంది పుదీనా చట్నీ లాగే కొత్తిమీర చట్నీ అంటూ కేవలం కొత్తిమీరతో ఉపయోగించి చేసుకుంటూ ఉంటారు. చాలామంది ధనియాలను చిన్న చిన్న కుండీలలో వేసుకుని కొత్తిమీరను పెంచుకుంటూ ఉంటారు. కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.

కొత్తిమీరను వంటకాల్లోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి కొత్తమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొత్తమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ లతో పాటు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం మెగ్నీషియం వంటి మూలకాలు కూడా ఉంటాయి. కొత్తిమీర తీసుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన సోడియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇది చెడు కొలెస్ట్రాల్ రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

అలాగే కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులలో తగినంత ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి పిత్త రుగ్మతలు కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నయం చేయడంలో ఎంతో బాగా సహాయపడతాయి. కొత్తిమీర తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు ప్రేగు సంబంధిత వ్యాధుల నుండి ప్రజలు ఉపశమనం పొందుతారు. ఆహారం లో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.