Site icon HashtagU Telugu

Buttermilk Benefits: ఏంటి.. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా!

Buttermilk Benefits

Buttermilk Benefits

మజ్జిగ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మజ్జిగలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. అందుకే మజ్జిగను రోజూ తినే ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో మజ్జిగను పెరుగును ఎక్కువగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. పెరుగుతో పోల్చుకుంటే మజ్జిగ వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మజ్జిగ తట్టుగా తీసుకోవడం వల్ల ఆయుష్యు కూడా పెరుగుతుందట. మజ్జిగలో కాల్షియంతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి.

కొవ్వులు తక్కువగా ఉన్న బటర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ అని పిలువబడే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అలాగే లాక్టిక్ యాసిడ్ అనే ఈ బ్యాక్టీరియా మనుషుల్లో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బటర్ మిల్క్‌ లో విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మజ్జిగ కేవలం చలవ చేయడం మాత్రమే కాదు. ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేకూరుస్తుందని బరువు తగ్గడంలో ఉపయోపడుతుందని చెబుతున్నారు. ఇది శరీరంపై ప్రత్యేకించి జీర్ణవ్యవస్థ పై శీతలీకరణ ప్రభావాన్ని అందిస్తుందని,యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా కడుపు లైనింగ్‌లో ఏర్పడే చికాకును తగ్గిస్తుందని చెబుతున్నారు.

ఆహారంతో పాటు మజ్జిగను తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుందట. ఇది ఎసిడిటీని అదుపు చేసి ఎముకలను బలపరుస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ చాలా ఉపయోగకరంగా ఉంటుందట. మజ్జిగ ప్రోబయోటిక్ అంటే అందులో ఆరోగ్యకరమైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. మజ్జిగ అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. మజ్జిగలో విటమిన్ డి ఉంటుంది. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుందట. అలాగే ఎముకలు బలపడతాయి. స్త్రీలు రుతుక్రమం తర్వాత మజ్జిగ తీసుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో తీసుకోవడం మరీ మంచిది. నిత్యం పల్చని మజ్జిగను తయారు చేసుకుని తాగితే తప్పక త్వరలోనే ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు.