Papaya: పచ్చి బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బొప్పాయిలో విటమిన్

  • Written By:
  • Publish Date - March 10, 2023 / 06:30 AM IST

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. బొప్పాయిలో విటమిన్ ఏ,బి,సి,ఈ, కాల్షియం,జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఆంటీ యాక్సిడెంట్ , ఫైబర్ ఇలా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ పుష్కలంగా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయిలో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ గుండె కు అందించిన సమస్యలను దూరం చేస్తాయి. అయితే కేవలం పండిన బొప్పాయి మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయి వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మరి పచ్చి బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చి బొప్పాయిని డైరెక్ట్ గా తినకుండా కూర లేదా సలాడ్ లు కానీ తీసుకోవచ్చు. పచ్చి బొప్పాయి తినడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైటో న్యూట్రిఎంట్స్ కొత్త కణాలను పెరిగేలా చేస్తాయి. జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తుంది. పచ్చి బొప్పాయి శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ గ్యాస్ట్రిక్ట్ సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది. నొప్పి, మంట, ఇన్ఫెక్షన్ వంటివి దరిచేయ నీయదు. బొప్పాయిలో ఆరోగ్య కరమైన ఎంజైమ్ లు ఉండడం వల్ల ఇది మలబద్ధకాన్ని నివారించి ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.

అంతేకాదు మధుమేహం ఉన్న వారికీ కూడా పచ్చి బొప్పాయి చాలా మంచిది. గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారికీ పచ్చి బొప్పాయి జ్యూస్ కానీ లేదంటే బొప్పాయి ఆకుల జ్యూస్ కానీ ఇస్తే ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. ఇక ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగ పడుతుంది. పచ్చి బొప్పాయి రోజూ తినడం వల్ల పిగ్మెంటేషన్, మచ్చలు, మొటిమలు వంటివి తగ్గిస్తుంది.