Pregnancy: గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఈ పనులు అస్సలు చేయకండి.. అవేంటంటే?

ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు ఒక సంతోషకరమైన విషయం. బిడ్డకు జన్మనివ్వడాన్ని అదృష్టంగా భావిస్తారు. తల్లిని అవ్వుతున్నానంటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 08:10 PM IST

Pregnancy: ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు ఒక సంతోషకరమైన విషయం. బిడ్డకు జన్మనివ్వడాన్ని అదృష్టంగా భావిస్తారు. తల్లిని అవ్వుతున్నానంటూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డకు హానీ కలగకుండా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చేయాలి? ఏ పనులు చూయకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో మహిళ శారీరకంగా, మానసికంగా చాలా మార్పులకు గురవుతూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పూర్తిగా బెడ్ పైనే విశ్రాంతి తీసుకుంటారు. బిడ్డకు ప్రమాదం జరుగుతుందేమోనని ఎలాంటి పనులు చేయరు. పూర్తిగా మంచానికే పరిమితం అయితే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పని ఎక్కువగా చేయకుడదు. పనిచేయాలనుకున్నప్పుడు జంక్ ఫుడ్, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉంటే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.

ఇక ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే తృణధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే బలంగా ఉంటారు. దీంతో పాటు మజ్జిగ ఎక్కువగా తాగుతూ ఉండలి. సలాడ్, పండ్లు, బిస్కెట్స్ ఎక్కువగా తినండి. ప్రతి గంటకు ఒకసారి పని నిమిషాలు నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక గర్భంతో ఉన్నప్పుడు లాగడం, ఎత్తడం, నెట్టడం వంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేస్తే గర్బంలో ఉన్న శిశువుకు చాలా ప్రమాదకరం. అలాగే ఉదయం లేవగానే వికారం, తలనొప్పగా అనిపిస్తే స్నాక్స్ తీసుకోండి. వీటితో పాటు శిశువు పెరుగుదల కోసం ఫోలిక్ యాసిడ్ లాంటివి తీసుకోవడం మంచిది. కాళ్ల నొప్పి అనిపించినప్పుడు కాళ్లు చాచి పెట్టుకోండి. ఇలాంటి జాగ్రత్తలు పాిటించడం వల్ల గర్బిణీ మహిళతో పాటు కడుపులోని శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటాడు.