పీరియడ్స్(Periods) అంటే స్త్రీలకు(Women) భయంగా ఉంటుంది. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా హార్మోన్ ఇన్ బ్యాలన్స్ వలన చాలా రకాల సమస్యలు వస్తాయి. నెలసరి సమయంలో బయటకు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నెలసరి సమయంలో మహిళలు కొన్ని ఆహారపదార్థాలకు(Food) దూరంగా ఉండడం వలన ఆరోగ్యానికి(Health) మంచిది. మహిళలు తమకు వచ్చే మూడ్ స్వింగ్ నుండి తప్పించుకోవడానికి టీలు, కాఫీలు తాగుతుంటారు. కానీ వీటిని ఎక్కువగా తాగడం వలన పొట్ట నొప్పి, మానసికంగా ఆందోళనకు గురవుతారు.
పీరియడ్స్ సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. కొవ్వు ఉండే పదార్థాలు తింటే పొత్తి కడుపులో నొప్పి, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. స్త్రీ జననేంద్రియాలలో కూడా సమస్యలు వస్తాయి. చక్కర ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినకూడదు. వాటిని తినడం వలన మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీనివల్ల మనకు స్వీట్ గా ఉండే పదార్థాలను తినాలని అనిపిస్తుంది. ఇలా చేయడం వలన మనకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో చక్కర ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి.
పీరియడ్స్ సమయంలో మద్యం తాగకూడదు. మామూలు రోజుల్లో పాలు తాగడం మన ఆరోగ్యానికి మంచిది. కానీ పీరియడ్స్ సమయంలో పాలు తాగకూడదు ఎందుకంటే పాలల్లో ఉండే లాక్టోజ్, అరాకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది. అది మన పొట్ట ఉబ్బరాన్ని పెంచి పొట్టలో నొప్పి వచ్చేలా చేస్తుంది. కాబట్టి స్త్రీలు పీరియడ్స్ సమయంలో పైన చెప్పిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.
Also Read : Vrikshasana : వృక్షాసనం చేయడం వలన కలిగే ప్రయోజనాలు..