Site icon HashtagU Telugu

Winter Tips: చలికాలంలో బాత్రూంలో అలాంటి పని చేస్తున్నారా.. అయితే గుండెపోటు రావడం ఖాయం!

Winter Tips

Winter Tips

ప్రస్తుతం చలికాలం కావడంతో కొన్ని ప్రదేశాలలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. దానికి తోడు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలు అయినా సరే ఇంకా మంచు అలాగే ఉంటోంది. అయితే ఈ శీతాకాలం వచ్చింది అంటే చాలు చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సీజన్ వ్యాధులతో పాటు మనం చేసే కొన్ని కొన్ని తప్పుల వల్ల ప్రాణాలు సైతం పోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో స్నానం చేసే సందర్భంలో కొన్ని పొరపాట్లు చేయకూడదని చెబుతున్నారు. గుండెల్లో నొప్పి రావడం, లేదా బాత్రూమ్ లో గుండె పోటుతో మరణించిన వారి సంఖ్య చాలానే ఉంది.

పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ఇలా చనిపోయినవాళ్లు ఉన్నారు. చలికాలంలో స్నానం చేసే సమయంలో మనకు గుండెపోట వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందట. అయితే ఇందుకు గల ప్రధాన కారణం చలికాలంలో సరిగ్గా స్నానం చేయకపోవడమేనట. అవును ఇది నిజమే. చలికాలంలో బాత్రూమ్ లో స్నానం చేసే సమయంలో చాలా మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి చలికాలంలో ప్రతి ఓక్కరూ దీనిపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని వాతావరణంలో సరైన స్నానం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ముందుగా పాదాలను కడుక్కోండి తర్వాత నడుము కింది భాగంలో నీళ్లు పోయాలి.

ఇలా స్నానం చేయడం వల్ల గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరంపై అకస్మాత్తుగా నీటిని పోస్తే అది మీ ఆరోగ్యానికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి సరిగ్గా స్నానం చేయడం చాలా ముఖ్యం. చల్లటి వాతావరణంలో స్నానానికి ముందు ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె ఉపయోగించాలి. ఈ నూనెలతో మసాజ్ చేయడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఇలా చేయడం వల్ల జలుబును కూడా నివారించవచ్చు. మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుందని తద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు.

Exit mobile version