Site icon HashtagU Telugu

Health Tips: చలికాలంలో వచ్చే దగ్గు జలుబు త్వరగా తగ్గాలంటే ఇలా చేయాల్సిందే!

Health Tips

Health Tips

చలికాలం మొదలయింది అంటే చాలు మనకు సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా చల్లటి వాతావరణంలో దగ్గు, జలుబు,జ్వరం వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జ్వరం తొందరగా తగ్గిపోయినా దగ్గు జలుబు మాత్రం కొన్ని వారాలపాటు అలాగే వేధిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం ఈ చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దాంతో ఈ జలుబు దగ్గు తగ్గడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ దగ్గు జలుబు నుంచి త్వరగా ఉపసమనం పొందాలంటే తప్పకుండా కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం అల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గు లక్షణాలను తగ్గిస్తాయి. ఒక చెంచా తాజా అల్లం రసం తీసి అందులో తేనె కలపాలి. ఇది రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, శ్లేష్మం నుంచి ఉపశమనం లభిస్తుందట. అలాగే ఆయుర్వేదంలో తులసి, లవంగాల వాడకానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఆకులు, లవంగాలను నీటిలో మరిగించి టీ తయారు చేసుకుని తాగాలి. రుచి కోసం కొంచెం తేనెను కూడా కలుపుకోవచ్చు. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని చెబుతున్నారు. ముక్కు దిబ్బడ, శ్లేష్మం సమస్యతో ఇబ్బందిపడేవారు.

ఆవిరి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇది అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పట్టాలి. ఇది ముక్కు దిబ్బద, జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుందట. ముఖ్యంగా రాత్రి సమయంలో ఆవిరి పట్టుకోవడం వల్ల రాత్రిళ్లు చల్లగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని పడుకునే ముందు తాగడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందట. అదేవిధంగా గోరువెచ్చని నీటిలో కాసింత ఉప్పు వేసి ఆ నీటిని పుక్కలిస్తూ ఉండడం వల్ల గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు..