‎Winter Care: ఈ సింపుల్ టిప్స్ తో చలికాలంలో వచ్చే ఆ వ్యాధులకు చెక్! మందులతో పనేలేదు!

‎Winter Care: ఇప్పుడు చెప్పబోయే ఈ వంటింటి చిట్కాలను ఉపయోగించి చలికాలంలో వచ్చే చాలా రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Published By: HashtagU Telugu Desk
Winter Care

Winter Care

‎Winter Care: చలికాలం మొదలైంది అంటే చాలు సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే జ్వరం తగ్గడానికి రావడానికి ముఖ్య కారణం ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమే. ఇలా సీజనల్ వ్యాధులు వచ్చాయి అంటే చాలు వెంటనే హాస్పిటల్ కి పరిగెడుతూ ఉంటారు. రకరకాల మెడిసిన్ తీసుకున్న కూడా కొన్నిసార్లు సీజనల్ వ్యాధులు తగ్గవు.

‎అయితే కొందరు కొందరు టాబ్లెట్స్, ఇంజక్షన్స్ వేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. అయితే అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో చేసే అతిపెద్ద తప్పు నీరు తక్కువగా తాగడం. తగినంత నీళ్లు తీసుకోవాలట. లేదంటే గోరువెచ్చని నీరు, హెర్బల్ టీలు కూడా తీసుకోవచ్చని, ఇవి శరీరంలోని ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తాయని, మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయని చెబుతున్నారు. కాగా మీరు బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే.. కొన్ని చుక్కల లావెండర్ నూనెను వేడి నీటిలో వేసి ఆవిరి పట్టుకోవచ్చట. దీనివల్ల ముక్కుదిబ్బడ దూరమవుతుందట.

‎జలుబు వల్ల శ్వాస తీసుకోవడంలో వచ్చే ఇబ్బందులు దూరమవుతాయని చెబుతున్నారు. గొంతు ఇన్​ఫెక్షన్లు ఉంటే టీ లేదా వేడిగా ఏదైనా తాగితే మంచిది అనుకుంటారు. దానికి బదులుగా మీరు హెర్బల్ డ్రింక్స్ లేదా సూప్ తీసుకోవచ్చట. అల్లం టీ కూడా మంచి ఉపశమనం ఇస్తుందని, మిరియాల పాలు కూడా రిలీఫ్ ఇస్తుందని చెబుతున్నారు. చలికాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. మలబద్ధకం, గుండెల్లో మంట వంటివి ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో మీరు గోరువెచ్చని నీరు తీసుకుంటే మంచిదట. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని చెబుతున్నారు. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుందని, అలాగే వింటర్​లో తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకుంటే మంచిదని భారీ మసాలా ఫుడ్ తీసుకుంటే అసౌకర్యం వస్తుందని చెబుతున్నారు. చలికాలంలో తేమ వల్ల కీళ్లనొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి జరుగుతాయట. అలా జరగకుండా ఉండాలంటే తేలికపాటి వ్యాయామాలు చేయాలని, కీళ్ల ఇబ్బందులు దూరం చేసుకోవడానికి వెచ్చని నీటితో మసాజ్ చేసుకోవడం లేదా హీట్ ప్యాక్ వంటివి ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

  Last Updated: 26 Nov 2025, 09:54 AM IST