‎Winter Foods: చలికాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా.. అయితే రోగాలకు హాయ్ చెప్పినట్టే!

‎Winter Foods: చలికాలంలో మనం తెలిసి తెలియక తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయని ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Published By: HashtagU Telugu Desk
Winter Foods

Winter Foods

‎Winter Foods: చలికాలంలో కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. మనం చలి కాలంలో తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తాయట. వాటిని తింటే కడుపునొప్పి, వికారం వాంతులు వంటివి అవ్వవచ్చు అని చెబుతున్నారు. మరి చలికాలంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది.

‎కానీ ఇది కడుపును బరువుగా చేసి జీర్ణక్రియను మందగించేలా చేస్తుందట. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, ముఖంపై సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. పచ్చి కూరగాయలు, సలాడ్లు వేసవిలో బాగుంటాయి. కానీ చలికాలంలో ఇవి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయట. పచ్చి ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కాబట్టి దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగు, మజ్జిగ, చల్లని పాల ఉత్పత్తులు ఈ సీజన్లో శ్లేష్మం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను పెంచుతాయట. చలికాలంలో వీటి ప్రభావం గొంతు, సైనస్లపై త్వరగా పడుతుందని, కాబట్టి వాటిని తగ్గించడం మంచిదని, లేదా వేడి పాలు వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని చెబుతున్నారు.

‎అదేవిధంగా చలికాలంలో పండుగలు, ఇంట్లో తయారు చేసిన మిఠాయిల కారణంగా చక్కెర తీసుకోవడం పెరుగుతుందట. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుందని, దీనివల్ల జలుబు, దగ్గు త్వరగా వస్తాయని, బెల్లం, ఖర్జూరం వంటి ప్రత్యామ్నాయాలు తీసుకోవచ్చని చెబుతున్నారు. చలికాలంలో వేడి టీ, కాఫీ ఒక అలవాటుగా మారతాయి. కానీ వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుందట. దీనివల్ల చర్మం పొడిబారడం, అలసట, నిద్రకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయని,కాబట్టి హెర్బల్ లేదా మసాలా టీ మంచిదని చెబుతున్నారు. వీటిని కూడా మోతాదుకు మించి తీసుకోకూడదు అని చెబుతున్నారు. చలికాలంలో వేడి వేడి నాన్ వెజ్ కర్రీలు, మసాలా గ్రేవీలు తినడం పెరుగుతుందట. కానీ మటన్ వంటి భారీ ఆహారాలు ఎక్కువగా తింటే అది నేరుగా కడుపుపై ప్రభావం చూపుతుందని, జీర్ణక్రియ నెమ్మదిస్తుందని, గ్యాస్, భారంగా అనిపించడం లేదా మంట వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

  Last Updated: 11 Dec 2025, 07:56 AM IST