Winter: చలికాలం మొదలయ్యింది. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతూనే ఉంది. అయితే ఈ చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం తప్పనిసరి. అందుకోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ చలికాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగానే డయాబెటిక్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
చలికాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ సీజనల్ లో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా చెబుతున్నారు. ఇందుకోసం ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లు తాగాలట. అలాగే బ్రేక్‌ఫాస్ట్ లో తప్పనిసరిగా ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాకుండా చలికాలంలో పండ్లు ఎక్కువైతే గ్లూకోజ్ పెరుగుతుందట కాబట్టి పరిమితి పాటించాలని చెబుతున్నారు.
ముఖ్యంగా రాత్రిళ్లు హెవీ ఫుడ్ తీసుకోవటం మానేయాలని చెబుతున్నారు. తప్పనిసరిగా ప్రతి రోజూ 20 నుంచి 30 నిమిషాలు వాకింగ్ చేయాలని చెబుతున్నారు. అలాగే ఎప్పటికప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలని, టాబ్లెట్స్ వంటివి ఉపయోగిస్తూ ఉండాలని చెబుతున్నారు. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు మిగతా సీజన్లతో పోల్చుకుంటే చలికాలం మరింత జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఈ సీజన్లో ఏది పడితే అది తినకుండా నిపుణులు సలహా మేరకు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
Winter: చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే.. ఏం చేయాలో మీకు తెలుసా?

Winter Diabetes