Winter: చలి కాలంలో వేడినీటితో స్నానం చేస్తే ఇక అంతే సంగతులు?

చలికాలం వచ్చింది అంటే చాలు చాలామంది వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే

  • Written By:
  • Publish Date - February 10, 2023 / 06:30 AM IST

చలికాలం వచ్చింది అంటే చాలు చాలామంది వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే చలికాలంలో వేడి నీటితో ముఖం కూడా కడుక్కుంటూ ఉంటారు. చాలా వరకు చల్ల నీళ్లను తాకకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చలికాలంలో వేడి నీటి స్నానం అసలు మంచిది కాదు. ఏంటాఅని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…వేడి నీటితో క్రమం తప్పకుండా స్నానం చేయడం అంత మందిది కాదు.

ఎందుకంటె ఇలా స్నానం చేసే పురుషుల్లో వీర్య కణాలు వేడెక్కడంతో పాటుగా 4 నుంచి 5 వారాల్లో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. ఇది పురుషులలో నపుంసకత్వం ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. అంతే కాదు చాలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ తొలగిపోయి చర్మం పొడిబారి గరుకుగా మారుతుంది. వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల కళ్ళు కూడా దెబ్బతింటాయి. అది కంటి గాయాల నుంచి థర్మల్ నెక్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. సమస్య ఎక్కువైతే అంధత్వం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతుంది.

చలికాలంలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే ప్రస్తుత రోజులో వాతావరణ కాలుష్యం, పోషకాల లోపం, చుండ్రు వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు దెబ్బతింటుంది. జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. ఎక్కువ వేడిగా ఉండే నీటితో జుట్టును కడగడం వల్ల నెత్తిమీద చర్మం కాలిపోతుంది. చుండ్రు, దురద, చికాకు వంటి సమస్యలు కూడా వస్తాయి.