Site icon HashtagU Telugu

Health Benefits of RedWine : వైన్ ఎంత తాగాలో కరెక్ట్ డోసు తెలుసుకోండి…ఇలా తాగితే హెల్త్ కు చాలా మంచిది..!!

Red Wine Fight Cancer

Red Wine Fight Cancer

వైన్…ద్రాక్షపళ్లను పులియబెట్టి వాటి రసంతో తయారు చేసే ఆల్కాహాలిక్ పానీయం. ఇది గుండెకు మంచిది. అంతేకాదు ఎన్నో అరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. జీర్ణక్రియకు సహకారిగా ఉంటూ …పలు వ్యాధుల చికిత్సకు మంచి ఔషదంగా ఉపయోగపడుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2018 స్టడీ ప్రకారం రెడ్ వైన్ లో ఉండే పాలీఫెనాల్స్ ఆరోగ్యకరమైన హ్రుదయనాళ పనితీరుకు అవసరమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఆహారం, పానీయాల్లో వాటిని చేర్చిస్తే..డయాబెటిస్ , కొన్ని క్యాన్సర్లతోపాటు గుండె సంబంధ రుగ్మతల ప్రమాదం తగ్గుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
ఈ మధ్య కాల అధ్యయనాల ప్రకారం రెడ్ వైన్ను తక్కువగా తీసుకుంటే హానికర కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనికోసం రియోజా స్టైల్ రెడ్ వైన్స్ ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందాయి.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
వైన్ కొవ్వును నియంత్రించడంతోపాటు మొత్తం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు. రెడ్ వైన్స్ లో ఉండే యాంటీయాక్సిడెంట్లో పాలీఫెనాల్స్ కూడా ఒకటి. రక్తనాళల్లో ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది:
ద్రాక్షతొక్కలోని యాంటీఆక్సిడెంట్ రెస్వెరాట్రాల్..బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. రెస్వెరాట్రాల్ పై ఓ అధ్యయనం ప్రకారం దాదాపు 3 నెలల పాటు ప్రతిరోజూ వైన్ 250గ్రాములు తీసుకున్నవారిలో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గినట్లు గుర్తించారు.

డిప్రెషన్ కు దూరం:
మితంగా ఆల్కహాల్ తీసుకుంటే డిప్రెషన్ను దూరం చేస్తుంది. అందుకే రెడ్ వైన్ తాగేవారు డిప్రెషన్ నుంచి రక్షణపొందుతారు.

దీర్ఘాయువు అందిస్తుంది:
రెడ్ వైన్ను మితంగా తీసుకుంటే…తీసుకోనివారి కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను లిగి ఉన్నందున దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తుంది.

 

 

Exit mobile version