Water and Peanut: పల్లీలు తిన్న వెంటనే నీరు తాగకూడదా? తాగితే ఎలాంటి నష్టాలు వస్తాయ్?

వేరుశెనగ విత్తనాలు లేదా పల్లీలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 4, 2022 / 06:15 AM IST

వేరుశెనగ విత్తనాలు లేదా పల్లీలు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అలాగే మనం తినే రోజువారి ఆహార పదార్థాలలో ఈ పల్లీలను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటాం. అయితే వేరుశెనక్కాయలు కొంతమంది ఉడకబెట్టి మరి కొంతమంది పచ్చిగా మరి కొంతమంది కాల్చుకొని ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు తింటూ ఉంటారు. వేరుశనగలను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. ఈ పల్లిల్లో బోలెడన్ని పోషకాలు దాగి ఉన్నాయి. అలాగే శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ ఈ నియాసిస్, ప్రోటీన్ మంగానీస్ అధికంగా ఉంటాయి.

అయితే చాలామంది ఈ పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగుతూ ఉంటారు. అయితే పల్లీలను తిన్న వెంటనే నీరు తాగకూడదు అని మన ఇంట్లోని పెద్దలు అలాగే వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఈ పల్లీలు తిన్న వెంటనే నీటిని తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఆహారనాలంలో కొవ్వుకు పోరుకపోవడమే కాకుండా శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా గ్యాస్ అజీర్తి సమస్యలు కూడా ఎదురవుతాయట. కాబట్టి ఎప్పుడైనా కూడా పల్లీలను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.

ఒకవేళ తాగాల్సి వచ్చిన 15 నుంచి 20 నిమిషాలు గ్యాప్ తర్వాత తాగడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. చల్ల నీరుకు బదులుగా వేడి నీళ్లు తాగితే ఇంకా మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. వేరుశనగలు పోషకాలతో నిండి ఉంది. అయితే ఇవి పొడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువలన వీటిని తింటే ఎక్కువగా దప్పిక వేస్తుంది. అయితే తిన్న వెంటనే నీటిని తాగకూడదు. ఎందుకంటే పల్లీల లో నూనె ఉంటుంది. దీనిని తిన్న వెంటనే నీరు తాగడం వలన పేగులలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దాంతో పల్లీలు తినగానే త్వరగా జీర్ణం కావు. దీని వలన గ్యాస్, అసిడిటీ, అజీర్తి, వంటి సమస్యలు వస్తాయి. ఇంకా ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చు.