Site icon HashtagU Telugu

Diabetes: మటన్ తింటే డయాబెటిస్ వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Mixcollage 05 Feb 2024 03 43 Pm 3764

Mixcollage 05 Feb 2024 03 43 Pm 3764

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే షుగర్ వచ్చిన వారు ఎక్కువగా ఆలోచించే విషయం ఏమిటంటే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు. ఏవైనా ఆహార పదార్థాలు తీసుకుంటే షుగర్ పెరుగుతుందేమో అన్న భయంతో చాలా రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇటువంటి వాటిలో మటన్ కూడా ఒకటి. చాలామందికి మటన్ తింటే ఏమైనా అవుతుందేమో,షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయేమో అని భయపడుతూ ఉంటారు.

ఇంకొందరు అయితే మటన్ తింటే డయాబెటిస్ వస్తుందని అంటూ ఉంటారు. నిజంగానే మటన్ తింటే డయాబెటిస్ వస్తుందా ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చెడు కొలెస్టరాల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. చెడు కొలెస్టరాల్ అంటే ఎల్డీఎల్, ట్రై గ్లిజరాయిడ్స్. ఇవి షుగర్ వ్యాధి ఉన్నవాళ్ల శరీరంలో ఎంత తక్కువగా పేరుకుపోతే.. అంత బెటర్. షుగర్ తో బాధపడుతూ చెడు కొవ్వు ఎక్కువగా ఉంటే వాళ్లు ఖచ్చితంగా మటన్ తినడం తగ్గించాలి. రెడ్ మీట్, పొట్టేలు మాంసం, మేక మాంసాన్ని తగ్గించాలి.

షుగర్ ఉన్నవాళ్లు తినే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండాలి కానీ,కొవ్వు ఉండకూడదు. మటన్ లో ఎక్కువ కొవ్వు ఉంటుంది. అది షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచుతుంది. ఒకవేళ మటన్ తినాలనిపిస్తే కొద్దిగా కొవ్వు లేకుండా చాలా రోజులు గ్యాప్ ఇచ్చి తీసుకుంటే బెటర్. అదేపనిగా రోజూ మటన్ తింటే మాత్రం ఖచ్చితంగా షుగర్ లేవల్స్ పెరిగి ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఒంట్లో ఉన్న కొవ్వును కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం నిపుణుల సలహాతో మాత్రలు కూడా వాడవచ్చు. కొలెస్టరాల్ కంట్రోల్ కు డాక్టర్లు కొన్ని మెడిసిన్స్ ను సూచిస్తుంటారు.