Site icon HashtagU Telugu

Eating Habits: భోజనం చేస్తున్నవారిపై కోపడకూడదా..?

Food

Food

భోజనం చేస్తూ పక్కవారితో మాట్లాడొద్దని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్న పిల్లలను కానీ పెద్దవారిని మందలించకూడదని…అమ్మమ్మ, తాతయ్య వంటి వాళ్లు ఆ సమయంలో తిట్టకూడదని అడ్డుపడుతుంటారు. ఇలా భోజనం చేసేవారిపై కోపడకూడదని…ఆవేశపడకూడదు అనడానికి అనేక కారణాలు ఉన్నాయి.

భోజనం అనేది పవిత్రమై ప్రదేశంలో కూర్చోని తినాలి. ప్రశాంతంగా తిన్నప్పుడే అది వంటబడుతుంది. అందుకే హడావిడిగా కాకుండా…మాట్లాడకుండా భోజనం చేయాలని పెద్దలు చెబుతుంటారు. నిజానికి ఆనందానికి…ఆకలికి మధ్య దగ్గర సంబంధం ఉంటుంది. మనసు సంతోషంగా ఉంటే…ఆకలి అవుతుంది. అదే బాధగా..చిరాకుగా ఉంటే ఆకలి కాదు.

పిల్లలైనా..యువకులైనా..పెద్దలైనా…తెలిసో తెలియకో…ఏదైనా పొరపాటు చేస్తే…వాళ్లుభోజనం చేసే సమయంలో తల్లిదండ్రులు మందలిస్తుంటారు. ఆ మాటలను భరిస్తూనే…బాధపడుతూనే వాళ్లు భోజనం చేస్తుంటారు. ఇలా ఆవేదనని అణచుకుంటూ చేసిన భోజనం వంటబట్టదు. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా కొనితెస్తుందని అంటారు. ఇక భోజనం చేస్తూనే పిల్లలు ఎదురు జవాబు చెప్పేందుకు ప్రయత్నిస్తే పొలమారి ప్రాణాపాయం సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇంకొంతమంది ఆవేశాన్ని అణచుకోలేక అన్నం ప్లేటును విసిరికొడుతుంటారు. జీవితంలో ఎవరైతే…దేనినైతే నిర్లక్ష్యం చేస్తారో..కోపంతో విసిరికొడతారో…అది వాళ్లకు దూరమవుతుందనేది ఎంతో మంది విషయంలో నిరూపితమైంది. ఇక పిల్లలు కోపంతో భోజనం చేయకుండా వెళ్లిపోతే…ఏ తల్లిదండ్రులు కూడా కంచాల ముందు కూర్చోరు. ఫలితంగా వండుకున్న పదార్థాలన్నీ కూడా వేస్ట్ అవుతుంటాయి.

పర్వదినానా కాకుండా…కొందరు కోపంతో కటిక ఉవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్నవారిపై ఆవేశపడటం వల్ల శాస్త్ర సంబంధమైన దోషాలతోపాటు..అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. అందుకే భోజన సమయంలో సాధ్యమైనంత వరకు కోపతాపాలకు పోకుండా…ఉండటం అన్నివిధాలా మంచిది.