Site icon HashtagU Telugu

Health Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ పండు తినాల్సిందే!

Strawberry Og (1)

Strawberry Og (1)

మామూలుగా చలికాలంలో చాలా రకాల పండ్లు కాయగూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో దొరికే కొన్ని సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా సీజనల్ పరంగా వచ్చే కొన్ని రకాల వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చట. ఇకపోతే చలికాలంలో లభించే పండ్లలో స్ట్రాబెర్రీ కూడా ఒకటి. ఇవి మనకు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ స్ట్రాబెర్రీలను అనేక రకాల స్వీట్లు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే స్ట్రాబెర్రీలను వంటకాలుగా కాకుండా కేవలం పండుగా మాత్రమే తింటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కేవలం పండుగా మాత్రమే తింటే చాలా బెటర్ అని చెబుతున్నారు. అయితే చలికాలంలో ఎక్కువగా దొరికే స్ట్రాబెర్రీలను ఎందుకు తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్ట్రాబెర్రీ పండు సెల్ డ్యామేజ్‌ ను నివారించడంలో కూడా సహాయపడుతుందట. వివిధ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుందని, స్ట్రాబెర్రీ లోని వివిధ పదార్థాలు చర్మంపై దద్దుర్లు, అలర్జీలు, అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయని చెబుతున్నారు. స్ట్రాబెర్రీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండు తినడం వల్ల మన మెదడు ఆరోగ్యంగా ఉంటుందట. స్ట్రాబెర్రీలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి నష్టంతో సహా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయని చెబుతున్నారు. అలాగే ఇది మెదడును అలర్ట్ గా, యాక్టివ్ గా, షార్ప్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుందట. స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండును ఎంచక్కా తినవచ్చు. ఈ పండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది.

కాబట్టి స్ట్రాబెర్రీలు అకస్మాత్తుగా రక్తంలో చక్కెర పెరుగుదల సమస్యను నివారిస్తాయి. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలను తినడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మీరు అంత ఈజీగా అనారోగ్యం బారిన పడరు. అలాగే విటమిన్ సి మన చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి స్ట్రాబెర్రీలను తినడం వల్ల మీ జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. స్ట్రాబెర్రీ లోని విటమిన్ సి కొల్లాజెన్ ప్రొటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని సహాయంతో చర్మం మంచిగా ఉండి నల్ల మచ్చలను తొలగిస్తుందట. స్ట్రాబెర్రీలో ఆంథో సైనిన్ అనే పదార్థం ఉంటుంది. దీని సహాయంతో మీ గుండె ఆరోగ్యం బాగుంటుందట. అలాగే ఫైబర్ పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.