Site icon HashtagU Telugu

Silver: నీటిలో సిల్వర్ కాయిన్ వేసుకొని తాగితే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

Silver

Silver

మామూలుగా మనం నీరు తాగడానికి స్టీల్ పాత్రలు,గ్లాస్ లేదంటే ప్లాస్టిక్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఈ మధ్యకాలంలో రాగితో తయారు చేసిన బిందెలు గ్లాసులు బాటిల్స్ ని ఉపయోగించి వాటిలో నిల్వచేసిన నీరు తాగుతున్నారు. ఆరోగ్యం గురించి అవగాహన ఎక్కువ అవ్వడంతో ఇలా రాగితో తయారుచేసిన వాటిలోని నీటిని ఎక్కువగా తాగుతున్నారు. కానీ ఈ ప్రస్తుతం వెండి పాత్రల గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. సిల్వర్ అదేనండి వెండి పాత్రలలోని నీరు తాగడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

మనం రోజూ తాగే నీళ్లలో ఓ వెండి నాణెం లేదా ఏదైనా వెండి వస్తువు వేసి ఉంచితే చాలట. అంతకు మించి మనం ప్రత్యేకంగా ఇంకేమీ చేయాల్సిన పని లేదని, ఇలా చేయడం వల్ల వెండిలో ఉన్న యాంటీ మైక్రోబయల్ గుణాలు నీళ్లలోకి చేరుతాయని చెబుతున్నారు. ఈ నీళ్లు శరీరానికి నేచురల్ డిటాక్స్ లా పని చేస్తాయట. బాడీలో ఉన్న అధిక వేడి తగ్గిపోతుందట. దీంతో పాటు మైండ్ ని రిలాక్స్ చేసేస్తాయని చెబుతున్నారు. రోజూ ఈ నీళ్లు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. అయితే సిల్వర్ వాటర్ తయారు చేసుకోవాలంటే ముందుగా స్వచ్ఛమైన వెండినే వాడాలట.

అంటే 99 శాతం ప్యూరిటీ ఉండాలి. సిల్వర్ కోటింగ్ ఉన్న వస్తువులు వాడకూడదట. కుండలో కానీ బిందెలో కానీ ఒక సారి వేసి అలాగే ఉంచకూడదట. కనీసం వారానికి ఒక సారైనా కచ్చితంగా ఆ కాయిన్ ని శుభ్రం చేయాలని, నిమ్మకాయ లేదా బేకింగ్ సోడాతో క్లీన్ చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ క్వాలిటీని చెక్ చేసుకోవాలట. అడుగున నీళ్లు సరిగ్గా లేకపోతే వెండి వేసిన ఉపయోగం ఉండదట. అందుకే నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలట. సిల్వర్ వాటర్ తాగడం మంచిదే కావచ్చు. కానీ ఇలా ఒక నాణెం లేదా ఇంకేదైనా వస్తువుని ఎక్కువ రోజుల పాటు బిందెలో లేదా కుండలో ఉంచడం మంచిది కాదని చెబుతున్నారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు తాజా నీళ్లను వెండి గ్లాసులు లేదా పాత్రల్లో ఉంచుకుని తాగితే మంచిదట. కుండలో ఉన్న నీళ్లను తాగే సమయంలో ఒక వెండి గ్లాసులో పోసుకుని వాటిని తీసుకోవాలని చెబుతున్నారు.