Mango Side Effects: వేసవిలో మామిడి పండు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడి పండ్లు లేదా కాయలు వేసవిలో మాత్రమే దొరుకుతాయి. ఈ మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండా కాలంలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇవి కేవలం సీజన్లో మాత్రమే లభిస్తుండడంతో చాలామంది వీటిని ఇష్టపడి ఎక్కువగా తింటూ ఉంటారు. మామిడి పండు తినడం మంచిదే కానీ అలానే ఎక్కువగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా ఆవేశంలో మామిడి […]

Published By: HashtagU Telugu Desk
Disadvantages Of Mango

Mango Side Effects

పండ్లలో రారాజు మామిడి. ఈ మామిడి పండ్లు లేదా కాయలు వేసవిలో మాత్రమే దొరుకుతాయి. ఈ మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండా కాలంలో మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇవి కేవలం సీజన్లో మాత్రమే లభిస్తుండడంతో చాలామంది వీటిని ఇష్టపడి ఎక్కువగా తింటూ ఉంటారు. మామిడి పండు తినడం మంచిదే కానీ అలానే ఎక్కువగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా ఆవేశంలో మామిడి పండ్లు ఎక్కువగా తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

We’re now on WhatsApp. Click to Join

అయితే వీటిని అతిగా తింటే మాత్రం అనర్ధాలు తప్పవు. సహాజంగా మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. అలాగే విటమిన్లు A, B, C, E, Kతో పాటు ఖనిజాలు సమృద్దిగా దొరుకుతాయి. ఇక మామిడిలో లభించే పాలీఫెనాల్స్, ట్రైటెర్పెన్, లూపియోల్‌ యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. మామిడి పండ్లు తింటే ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
మామిడిని అతిగా తినడం వల్ల విరేచనాలు అవుతాయి. మామిడి పండ్లలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండే పండ్లు తింటే విరేచనాలు అవుతాయి.

Also Read: Fruit Custard: సమ్మర్ స్పెషల్.. ఫ్రూట్ కస్టర్డ్ఎంతో టేస్టీగా తయారు చేసుకోండిలా?

అందుకే మామిడి పండ్లను మోతాదుకు మించి తినకూడదు. మామిడి పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కచ్చితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే.. మామిడి పండ్లు తినాలనిపిస్తే ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. కొంతమందికి మామిడి పండ్లు అలెర్జీని కలిగిస్తాయి. ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, తుమ్ములు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. మామిడి పండ్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లకు దూరంగా ఉంటే మంచిది. సగటు పరిమాణంలో ఉండే మామిడికాయలో 150 క్యాలరీలు ఉంటాయి. మామిడి పండ్లు అతిగా తింటే కొన్నిసార్లు అజీర్తి సమస్య కూడా తలెత్తవచ్చు. ముఖ్యంగా పచ్చి మామిడిని తిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల, పచ్చి మామిడికాయలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. అదే విధంగా, పండిన మామిడిపండ్లలో కార్బైడ్ అనే రసాయనం ఉంటుంది, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

Also Read: Hair Tips: నూనెలో ఇవి వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలు..జుట్టు ఒట్టుగా పెరగాల్సిందే?

  Last Updated: 03 Apr 2024, 07:38 PM IST