Site icon HashtagU Telugu

Tea: టీ లో చక్కరకు బదులు ఉప్పు కలుపుకొని తాగారా?

Tea

Tea

మామూలుగా మనం టీ లో చక్కెర లేదా బెల్లం వేసుకొని తాగుతూ ఉంటాం. ఎప్పుడైన టీ లో ఉప్పు వేసుకుని తాగారా, టీలో ఉప్పు వేసుకుని తాగడం ఏంటా అని అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. టీలో ఉప్పు వేసుకునే తాగితే అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మనం రోజూ తాగే టీలో కనుక చిటికెడు ఉఫ్పు వేసుకొని తాగితే ఈ సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చట. అంతేకాకుండా మన రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారు ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు టీలో చిటికెడు ఉప్పు వేసుకొని తాగితే జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయని చెబుతున్నారు.

సమ్మర్ లో ఎన్ని నీళ్లు తాగినా బాడీ డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. దీంతో డీ హైడ్రేషన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ ఎండల్లో టీ తాగలేం కానీ తాగకుండా ఉండలేం అనుకునేవారు చిటికెడు ఉప్పు వేసుకొని తాగాలట. ఇలా చేయడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుందట. ఉప్పు సహజంగానే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయం చేస్తుందని చెబుతున్నారు. కాగా చాలామంది ఉప్పు కేవలం రుచికి మాత్రమే పనిచేస్తుందని అనుకుంటూ ఉంటారు.
కానీ ఉప్పులో మెగ్నీషియం, సోడియం, కాల్షియం , పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయట.

అందుకే ఉప్పుని ఇలా తీసుకోవడం వల్ల మన మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుందని చెబుతున్నారు. టీ లో ఉప్పు వేసుకొని తాగడం వల్ల అది మన చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుందట. మన డ్యామేజ్డ్ స్కిన్ ని రిపేర్ చేస్తుందట.. అలాగే మెటిమలు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని, చర్మం మెరవడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. ఇకపోతే మనలో చాలా మంది మైగ్రేన్ వంటి తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి ఈ మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ ఉప్పు కలిపిన టీ బాగా పని చేస్తుందట. అలాగే మైండ్ ని కూడా రిలాక్స్ చేస్తుందట.

Exit mobile version