Site icon HashtagU Telugu

Hungry : ఎంత తిన్నా మళ్ళీ ఆకలి వేస్తుందా? అయితే ఈ సమస్యలు ఉండవచ్చు..

Why you get More Hungry even after Eating Food

Why you get More Hungry even after Eating Food

కొంతమిందికి ఎంత తిన్నా కాసేపటికే మళ్ళీ ఆకలి(Hungry) వేస్తుంది. మళ్ళీ ఏమైనా తినాలని(Eating0 అనిపిస్తుంది. అయితే తరచుగా ఆకలి అవడం అనేది ఏదయినా ఇతర అనారోగ్య సమస్య(Health Issue) కావచ్చు. ఎంత తిన్నా మళ్ళీ తినాలి అనిపించడానికి వేరే ఇతర సమస్యలు కూడా కారణం కావచ్చు.

* తరచుగా ఆకలి వేయడం వలన ఎక్కువగా తినడం వలన అధిక బరువు పెరుగుతారు.
* డయాబెటిస్ ఉన్నవారికి పదే పదే ఆకలి వేస్తుంది. వారు అన్ని రకాలు తినకూడదు ఎక్కువగా తినకూడదు కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి తరచుగా ఆకలి వేస్తుంది. ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి.
* రోజుకు ఎవరైనా ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. నిద్ర తగినంత లేకపోయినా తిన్న వెంటనే ఆకలి వేస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వలన విడుదల అయ్యే గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలిని పెంచేలా చేస్తుంది.
* థైరాయిడ్ సమస్య ఉన్నవారికి కూడా ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా కడుపు ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. తరచుగా ఆకలి వేస్తుంది.
* అధికంగా ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది.
* డిప్రెషన్ ఉన్నా కూడా ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది.
* మనం తినే ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోయినా ఆహారం తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది.
* యాంగ్జైటీ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారికి కూడా తరచుగా ఆకలి వేస్తుంది.

అందుకే ఈ సమస్యలని దూరం చేసుకొని మన శరీరానికి సరిపడా ఆహరం తింటే ఆరోగ్యంగా ఉంటాం.

 

Also Read : Health: క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి జోష్