Site icon HashtagU Telugu

Pregnancy Tips: గర్భిణీ స్త్రీలు టీ,కాఫీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Pregnancy Tips

Pregnancy Tips

స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. మన ఇంట్లో పెద్దలు కూడా అవి తినకూడదు ఇవి తాగకూడదు అని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో టీ, కాఫీలు తాగడం కూడా ఒకటి. టీలు కాఫీలు మామూలుగా తాగడం మంచిదే కానీ మితిమీరి తాగితే మాత్రం సమస్యలు తప్పవు. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీలు టీ,కాఫీ కంటే బదులుగా పాలు తాగడం మంచిదని చెబుతుంటారు. ఎప్పుడో ఒకసారి తాగితే సమస్యలు రావు కానీ తరచుగా ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.

అదేవిధంగా శృతి మించి తాగినా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే చాలామంది ప్రెగ్నెన్సీ సమయంలో టీ కాఫీలు తాగితే పుట్టబోయే బిడ్డ రంగు కోల్పోతుందని అంటూ ఉంటారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ప్రెగ్నెన్సీ టైంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగడం మంచిది కాదట. వీటిని ఎక్కువగా తాగడం వల్ల అబార్షన్, తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండకుండానే డెలివరీ కావడం, పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలు వస్తాయట. గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం రోజుకు 200 మిల్లీ గ్రాములకు పరిమితం చేయాలని సూచించారు. అంటే రోజుకు ఒక కాఫీ లేదా టీ అయితే సరిపోతుందట.

ప్రెగ్నెన్సీ సమయంలో హెర్బల్ టీని తీసుకుంటే మేలు జరుగుతుందట. అయితే డాక్టర్ సలహా మేరకు ఈ హెర్బల్ టీ తాగాలని చెబుతున్నారు. బిడ్డ ఎదుగుదలకు, ఆరోగ్యానికి సమతుల్య ఆహారం తీసుకోవాలట. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు అన్న విషయాల గురించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కేవలం టీ కాఫీల విషయంలో మాత్రమే కాకుండా ఇంకా ఇతర ఆహార విషయంలో కూడా వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.