మామూలుగా గర్భిణీ స్త్రీలు మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు చెప్పిన సలహాలు పాటించాలని చెబుతూ ఉంటారు.. అలాగే గర్భిణీ స్త్రీలు అనేక రకాల టెస్టులు, స్కానింగ్ లు కూడా చేయించుకోవాలని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో థైరాయిడ్ టెస్ట్ కూడా ఒకటి. చాలామంది డాక్టర్స్ గర్భిణీ స్త్రీలకు థైరాయిడ్ టెస్ట్ కచ్చితంగా చేయించుకోవాలని చెబుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలా వద్ద అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..థైరాయిడ్ గ్రంథి అనేది మన గొంతు భాగంలో ఉంటుంది.
ఇది ఎన్నో విధులను నిర్వహిస్తుంది. ఇది సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో థైరాయిడ్ ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే జీవక్రియకు సహాయపడుతుంది. మొత్తం శ్రేయస్సును నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అయితే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయదు. కానీ దీనివల్ల తల్లి, లోపల పెరుగుతున్న పిండంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే థైరాయిడ్ పరీక్ష అనేది ప్రినేటల్ కేర్‌లో ఒక ముఖ్యమైన భాగమని నిపుణులు చెబుతున్నారు. కాగా థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
ముఖ్యంగా థైరాక్సిన్ ట్రైయోడోథైరోనిన్ లు ఇవి జీవక్రియ, శక్తి ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తేనే కడుపులో పిండం పెరుగుదల బాగుంటుంది. కానీ ఈ సమయంలో చాలా మంది గర్భిణులు హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యల బారిన పడుతుంటారు. కానీ ఇది గర్భిణులను ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. బిడ్డ ఆరోగ్యం కూడా రిస్క్ లో పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి పైన చెప్పిన సమస్యలు ఉండకూడదు అంటే గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా థైరాయిడ్ టెస్ట్ ను చేయించుకోవాలి.. కాగా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను తయారుచేయదు. దీనివల్ల అలసట, బరువు పెరగడం, పిండం అభివృద్ధి చెందకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
అయితే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫ్రీ థైరాక్సిన్అనేవి హార్మోన్ ను కొలిస్టే టెస్ట్ లు. ప్రెగ్నెన్సీ టైంలో హైపోథైరాయిడిజంను గుర్తించి, దాన్ని నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ పరీక్ష కేవలం సాధారణ చెకప్ మాత్రమే కాదు. ఇది తల్లి, గర్బంలో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక ముందడుగు. అందుకే కాబోయే తల్లులు వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన టెస్ట్ లు చేయించుకోవాలి. అలాగే థైరాయిడ్ టెస్ట్ లు వారి ప్రినేటల్ కేర్‌లో ఒక సాధారణ భాగమని అర్థం చేసుకోవాలి.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.