మామూలుగా చాలా మంది పొడి దగ్గు జలుబు వంటివి కేవలం చలికాలంలోనే వస్తూ ఉంటాయని భ్రమపడుతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జలుబు దగ్గు లాంటి వాటికి సీజన్ తో సంబంధం ఉండదు. చాలామంది వేసవిలో కూడా పొడి దగ్గు, జలుబు,దగ్గుతో బాధపడుతూ ఉంటారు. చాలామంది వేసవిలో పొడి దగ్గుతో విపరీతంగా బాధపడుతూ ఉంటారు. నిరంతరం పొడి దగ్గు వేధిస్తూ ఉంటుంది. వేసవిలో పొడి దగ్గు ఎక్కువగా వేధిస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మాములుగా శీతాకాలంలో జలుబు, ఫ్లూ వల్ల దగ్గు వస్తుంటుంది. కొంత మందిలో వేసవిలో పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనక భాగంలో ఒక రకమైన చికాకు వల్ల పొడిదగ్గు వస్తుంది. ఈ చికాకుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే చికాకు ఎక్కువ రోజులు ఉంటే దగ్గు కూడా ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంది. కాగా వేసవిలో పొడి దగ్గుకు హేఫీవర్ కారణం కావచ్చు. గాలిలో దుమ్ము, ధూళి, పూల పుప్పొడి, ఇతర కారకాల వల్ల గొంతులో చికాకు మొదలవుతుంది. ఈ చికాకు వల్ల దగ్గు వస్తుంది. గొంతు వెనక భాగంలో పొడిబారడం వల్ల చికాకు వచ్చి దాని వల్ల దగ్గు రావొచ్చు. వేసవిలో గాలి పొడిగా ఉంటుంది. తేమ ఉండదు. ఈ పొడిగాలిని పీల్చుకోవడం వల్ల ముక్కు, గొంతులోని వాయు మార్గాలు చికాకుకు గురవుతాయి.
ఈ చికాకు దగ్గుకు దారితీస్తుంది. ఎండాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది. తేమ లేని పొడి గాలి వల్ల కాలుష్య కారకాలు ఒక చోటు నుండి చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. ఈ కారకాలు వల్ల శ్వాస నాళాలు చికాకు వచ్చి దగ్గు రావచ్చు. అందుకోసం రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. వేసవిలో చెమట రూపంలో ఎక్కువ నీరు పోతుంది కాబట్టి దానిని భర్తీ చేసేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి. పుప్పొడి, కాలుష్య కారకాలు గొంతు అలెర్జీకి కారణం అవుతాయి. వీలైనంత వరకు వాటిని నివారించడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఎయిర్ ఫిల్టర్ వంటివి ఉపయోగిస్తే బయటి కాలుష్యాన్ని వడపోసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వీలు ఉంటుంది. వేసవిలో చల్లని నీరు తాగాలని అనిపిస్తుంది. బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నప్పుడు చల్లని నీటి వల్ల ఉపశమనంగా అనిపిస్తుంది. అయితే చల్లని నీటి వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అందుకే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతులో చికాకును దూరం చేసుకోవచ్చు.