మామూలుగా అధిక బరువు, కూర్చుని పనిచేయడం, అలాగే ఇతర కారణాల వల్ల పురుషులకు పొట్ట ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి అయిన మగవారికి పొట్ట పెరిగి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పొట్ట ఒక్కసారి వచ్చింది అంటే చాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తగ్గదు అన్న విషయం తెలిసిందే. చాలామంది మగవారు పొట్ట తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇంతకీ ఈ పొట్ట ఎందుకు వస్తుంది? పొట్ట తగ్గడం కోసం ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పెళ్లైన తర్వాత బెల్లీ ఫ్యాట్ పెరిగే సమస్య మగవారిలో ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అయితే దీనివల్ల పొట్ట సైజు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే మరి కొంతమంది అసలు పట్టించుకోరు. అయితే పొట్ట పెరగడం ఎంత ఈజీనో దాన్ని తగ్గించుకోవడం అంతకు రెండింతలు కష్టమని చెప్పాలి. ఎందుకంటే నడుము సైజు తగ్గడానికి కొన్నిసార్లు సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు. అనారోగ్యకరమైన ఆహారం, కూర్చునే అలవాట్లు, బలహీనమైన జీర్ణవ్యవస్థ, ఇతర కారణాల వల్ల పురుషుల బెల్లీ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచుగా వ్యాయామం చేసే అలవాటును మీరు అలవర్చుకోవాలి.
ఇలా చేస్తే ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంతో పాటుగా పొట్టను, శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా యోగా, వ్యాయామం, కార్డియో వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి ఎంతో బాగా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే సరైన డైట్ నువ్వు ఫాలో అవుతూ కూడా బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా కరిగించుకోవచ్చట. ఇందుకోసం మీరు మీ రోజువారి ఆహారంలో పాత నూనెలకు బదులుగా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజా, ఆరోగ్యకరమైన నూనెలను జోడించాలని, ఇవి మీ పొట్ట పెరగకుండా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు తాగి కూడా పొట్టను తగ్గించుకోవచ్చట. నీళ్లను తాగితే చాలా వరకు ఆకలి కంట్రోల్ అవుతుందట. దీని వల్ల అతిగా తినరు. అందుకే ప్రతి రోజూ నీటిని పుష్కలంగా తాగాలని చెబుతున్నారు. అలాగే నీళ్లు జీవక్రియను ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతాయని, ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
బరువు తగ్గించడంలో అల్లం వెల్లుల్లి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందట. ఈ రెండింటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దగ్గు జలుబు వంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవడానికి ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయట. అందుకే వీటిని తరచుగా మీ డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అలాగే కూర్చున్నప్పుడు నిలుచున్నప్పుడు నిటారుగా నిలబడడం, కూర్చోవడం చేయడం వల్ల ఉదర కండరాలు సరైన స్థితిలో ఉంటాయట. దీనివల్ల నడుము నొప్పి రాకుండా ఉండటమే కాకుండా మీ పొట్ట పెరిగే అవకాశం కూడా ఉండదని చెబుతున్నారు.