Site icon HashtagU Telugu

Sleep Paralysis: నిద్రలో వచ్చే పక్షవాతం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే!

Sleep Paralysis

Sleep Paralysis

సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా కలలు కంటూ ఉంటారు. కొందరికి పీడకలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మన రోజువారి జీవితంలో జరిగే ఘటనలే సాయంత్రం కలల రూపంలో రిపీట్ అవుతూ ఉంటాయి అంటున్నారు మానసిక వైద్యులు. దీనినే స్లీప్ పెరాల్సిస్ లేదా నిద్రలో పక్షవాతం అని కూడా అంటారు. అయితే ఈ నిద్రలో వచ్చే పక్షవాతం భావన భయంకరమైన గా ఉంటుంది. ఈ నిద్రలో పక్షవాతం వచ్చినప్పుడు మీరు స్పృహలోనే ఉన్నప్పటికీ మీ శరీరాన్ని మాత్రం కదిలించలేరు. అయితే కొంతమంది నిద్రపోతున్నప్పుడు లేదంటే మేలుకున్నప్పుడు వారి చాతి పై ఒత్తిడి కలిగినట్లుగా, ఊపిరి తీసుకోలేని భావన ఎదుర్కొనేటప్పుడు ఇటువంటి పక్షవాతానికి గురవుతూ ఉంటారు.

ఇటువంటి పరిస్థితి కొన్ని సెకండ్ల పాటు లేదంటే కొన్ని నిమిషాల పాటు ఉంటుందట. అప్పుడు మనసులో కలిగే భయం, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటితో తరచుగా బాధపడే వారిలో ఈ రకమైనటువంటి పక్షవాతాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని నిపుణులు సూచిస్తున్నారు. REM cycle పూర్తి అవ్వకముందే ఎవరైతే నిద్ర లేస్తారో వారిలో ఈ పక్షవాతం రావచ్చట. REM cycle అనేది మెదడు చురుకుగా ఉన్నప్పుడు కళ్ళు సంభవించే నిద్ర యొక్క దశ. ఇటువంటి దశలోనే కండరాలు నిద్ర వస్తాలోకి జారుకుంటాయి. ఇందువల్ల కలలకి అనుగుణంగా మిమ్మల్ని మీరే బాధించుకునే విధంగా చేసే చర్యకు దారి తీస్తుంది.

అయితే ఇటువంటి పరిస్థితి సంభవించడానికి మీ మెదడు REM దశ నుండి బయటకు వచ్చినప్పటికీ శరీరం మాత్రం నిశ్చలమైన స్థితిలో ఉంటుంది. అయితే ఈ నిద్రలో పక్షవాతానికి గురైన వారు చిత్ర విచిత్రమైన అసాధారణమైన దృశ్యాలను చూసినట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే ఇలాంటి పక్షవాతం కలిగి ఉండేవారు రెండు రకాల బ్రాంతులను అనుభూతి చెందవచ్చు. అందులో ఒకటి ఇంట్రుడర్ ఫెనామెనొన్. రెండవది ఇంక్యూబస్. దీనివల్ల నిద్రలో నలిపి వేయడం లేదంటే ఊపిరి ఆడకుండా చేయడం లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఇటువంటి పక్షవాతంలి జన్యుపరమైన అంశాలు కూడా ముఖ్యపాత్రను పోషిస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటి పక్షవాతానికి ప్రత్యేకమైన చికిత్స లేదు. తీవ్రమైన కేసుల్లో యాంటీ డిప్రెసెంట్లను డాక్టర్లు సూచిస్తారు.