నిద్రలేవగానే బ్రష్ చేయ‌కూడ‌దా? నిపుణుల స‌మాధానం ఇదే!

సాధారణంగా ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తారు. ఈ సమయానికి బ్రష్ పోగులు (బ్రిజిల్స్) పాడైపోతాయి. ఒకవేళ మీ బ్రష్ అంతకంటే ముందే పాడైపోయినట్లయితే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది.

Published By: HashtagU Telugu Desk
Teeth Brush

Teeth Brush

Teeth Brush: సాధారణంగా చాలామంది ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసిన తర్వాతే ఏదైనా తింటారు లేదా తాగుతారు. కానీ కొంత‌మంది నిపుణుల సలహా ప్రకారం ఇలా చేయడం సరైనది కాదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. నిపుణులు ఆరోగ్యానికి సంబంధించిన పలు సూచనలు ఇస్తున్నారు. నిపుణుల ప్రకారం ఉదయం నిద్రలేవగానే అందరికంటే ముందుగా బ్రష్ చేయకూడదు. మనం రాత్రి పడుకున్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇందులో ‘లైజోజైమ్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఈ ఎంజైమ్ సూక్ష్మజీవులను నశింపజేయడమే కాకుండా పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. శరీర రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) పెంచుతుంది.

ఏ సమయంలో బ్రష్ చేయాలి?

ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసే బదులు, మొదట గోరువెచ్చని నీటిని తాగాలని నిపుణులు సూచించారు. ఇలా చేయడం వల్ల ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. కాలేయం (లివర్) పనితీరు మెరుగుపడుతుంది. గోరువెచ్చని నీరు తాగిన 10 నుండి 15 నిమిషాల తర్వాత మాత్రమే బ్రష్ చేయాలి. ఉదాహరణకు మీరు ఉదయం 7 గంటలకు నీరు తాగితే, 7:15 గంటలకు బ్రష్ చేయడం ఉత్తమం.

Also Read: పాలు తాగడం అందరికీ మంచిది కాదా? డాక్టర్ల కొత్త హెచ్చరిక!

బ్రష్ చేసే సరైన విధానం ఏమిటి?

పళ్ళను శుభ్రం చేసుకోవడానికి సరైన బ్రష్‌ను ఎంచుకోవడం ముఖ్యం. మరీ గట్టిగా (హార్డ్) ఉండే బ్రష్‌లను వాడకూడ‌ద‌ట‌. ఎందుకంటే అవి చిగుళ్లకు గాయాలు చేస్తాయి. బ్రష్‌ను పళ్ళపై గట్టిగా రుద్దకుండా సున్నితంగా శుభ్రం చేయాలి. బ్రష్‌ను చిన్న చిన్న వృత్తాకారంలో తిప్పడం వల్ల పళ్లు బాగా శుభ్రపడతాయి. పళ్లతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం 2 నిమిషాల పాటు బ్రష్ చేయాలి.

ఎన్ని నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి?

సాధారణంగా ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలని నిపుణులు సలహా ఇస్తారు. ఈ సమయానికి బ్రష్ పోగులు (బ్రిజిల్స్) పాడైపోతాయి. ఒకవేళ మీ బ్రష్ అంతకంటే ముందే పాడైపోయినట్లయితే, వెంటనే కొత్త బ్రష్ తీసుకోవడం మంచిది.

  Last Updated: 29 Dec 2025, 04:29 PM IST