మామూలుగా మనలో చాలామందికి తరచూ టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే టీ చేసేటప్పుడు చాలామంది కొద్దిగా అల్లం వేసుకుని తాగుతూ ఉంటారు. దీనివల్ల అనేక రకాల లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో ఇది ఎన్నో రకాల సమస్యలకు చక్కటి పరిష్కారంగా కూడా పనిచేస్తుంది. అయితే వేసవికాలంలో కూడా చాలామంది టీ తాగుతూ ఉంటారు. మరి అల్లం టీ ని వేసవికాలం తాగవచ్చా తాగకూడదా? ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవిలో మామూలుగా కొన్ని రకాల సమస్యలు రావడం అన్నది సహజం. ముఖ్యంగా తలనొప్పి అలసట నీరసం డిహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అల్లం టీ తాగడం వలన శరీరంలో వేడి మరింత పెరుగుతుందట. ఫలితంగా ఒత్తిడి, అసౌకర్యం, చెమట ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చట. ఇది వృద్ధులు, చిన్న పిల్లలు, నాజూకైన శరీర కలవాళ్లకు మరింత ఇబ్బంది కలిగించవచ్చని, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడం అవసరం. అందుకే ఈ కాలంలో అల్లం టీ వాడకాన్ని తగ్గించడం మంచిదని చెబుతున్నారు. అలాగే అల్లం టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందట. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ పరిమాణంలో తాగితే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, పుల్లటి తేన్పులు, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కలగవచ్చట.
వేసవిలో ఉష్ణోగ్రత ఇప్పటికే అధికంగా ఉన్నప్పుడు అల్లం టీ కారణంగా శరీరంలో వేడి మరింత పెరిగి జీర్ణవ్యవస్థ తాళలేక ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నారు వేసవిలో శరీరం ఎంతో త్వరగా నీటిని కోల్పోతుంది. కాబట్టి అలాంటి సమయంలో వేడి గుణం కలిగిన అల్లం టీ తాగడం వల్ల నీటి శాతం మరింత తగ్గిపోవచ్చట. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి, తలనొప్పి, అలసట, దాహం అధికంగా ఉండటం, ఒళ్లు బలహీనంగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా బయట తిరిగే వారు లేదా క్రమంగా నీరు తాగని వారు ఈ సమస్యకు లోనవుతారని చెబుతున్నారు. అల్లం టీ వల్ల రక్తం పలుచబడే అవకాశం కూడా ఉందట. శీతాకాలంలో ఇది ఉపశమనం కలిగించినా వేసవిలో ఇది హానికరం కావచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా రక్తాన్ని పలుచబెట్టే మందులు వాడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే అల్లం టీ కారణంగా రక్తం మరింత పలుచగా మారి చిన్న గాయానికి కూడా ఎక్కువ రక్తస్రావం జరిగే అవకాశముంటుందట. ఇది శరీరంలోని రక్తనాళాలపై ప్రభావం చూపేలా పని చేస్తుందని చెబుతున్నారు. అలాగేవేసవిలో తరచూ అల్లం టీ తాగడం వల్ల కొందరికి విరేచనాలు, పేగుల సంబంధిత సమస్యలు, నిద్రలేమి, అధిక రక్తపోటు, స్కిన్ అలర్జీలు వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చట. ముఖ్యంగా రాత్రివేళలలో అల్లం టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందట. అంతేకాక అలర్జీకి గురయ్యే వారు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా వేసవిలో అల్లం టీ తాగడాన్ని తగ్గించాలని,శరీరానికి తగిన ఉష్ణోగ్రతను నిలుపుకోవాలంటే వేడి స్వభావం ఉన్న పానీయాలను పరిమితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.