మనిషి శరీరంలో ఉన్న ముఖ్యమైన భాగాల్లో కళ్ళు కూడా ఒకటీ. అయితే మన జీవితంలో అన్నీ అవయవభాగాలు సక్రమంగా ఉన్న కళ్ళు లేకపోతే జీవితమంతా అంధకారంలా కనిపిస్తుంది. అందుకే కళ్ళు చాలా ముఖ్యమైనవి. కళ్ళు ఉంటే ఈ అందమైన ప్రపంచాన్ని చూడవచ్చు. లేకపోతే కళ్ళు లేని వారికి ఎంత అందమైన ప్రదేశానికి వెళ్ళినా కూడా అంధకారం గానే ఉంటుంది. అయితే కొంతమందికి కళ్ళు మెల్లగా గుండ్రంగా బాగా ఉంటే మరికొందరికి మాత్రం నీలిరంగులో అదేవిధంగా గోధుమరంగు, ముదురు గోధుమ రంగులో ఉంటాయి.
వీటినే చాలామంది పిల్లి కళ్ళు అని కూడా అంటూ ఉంటారు. అంటే అచ్చం పిల్లి కళ్ల లాగే కొంచెం నీళ్లు రంగులో ఉన్నాయి అని అర్థం. అయితే నిజానికి కంటి రంగు అనేది మనిషి యొక్క జన్యువులకు సంబంధించినది. కంటి రంగు అనేది శరీరంలోని మెలనిన్ శాతాన్ని అనుసరించి ఉంటుంది. దీనితో పాటు ప్రోటీన్ సాంద్రత, చుట్టూ ఉన్న కాంతి కూడా రంగును నిర్ణయించడంలో ప్రభావం చూపుతాయి.అయితే కంటి రంగు తొమ్మిది వర్గాలుగా విభజించడం జరిగింది. కంటి రంగుతో సంబంధం ఉన్న 16 జన్యువులు శరీరంలో ఉంటాయి.
కంటి రంగుకు కారణమయ్యే రెండు ప్రధాన జన్యువులు OCA2 , HERC2. రెండూ క్రోమోజోమ్ 15లో ఉన్నాయి. HERPC2 జన్యువు OCA2 యొక్క వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. HERC2 నీలి కళ్ళకు కొంతవరకు కారణంగా నిలుస్తుంది. అదే సమయంలో, OCA2 కొంతవరకు నీలం,ఆకుపచ్చ కళ్ళతో సంబంధం కలిగి ఉంటుంది. ఇక చాలా మందికి గోధుమ రంగు కళ్ళు ఉంటాయి. ఎందుకంటే దీన్ని అభివృద్ధి చేసే జన్యువులు చాలా మందిలో ఉంటాయి. నీలి కళ్ళు ఉన్న వ్యక్తుల సంఖ్య ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే సుమారు 6 వేల నుండి 10 వేల సంవత్సరాల క్రితం మానవ జన్యువులలో మార్పు వచ్చిందట.
దాని కారణంగానే చాలామంది కళ్ళ రంగు నీలం రంగులోకి మారడం ప్రారంభించిందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే నిజానికి ఈ బూడిద రంగు కళ్లు కలిగినవారిలో మెలనిన్ పిగ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ సాంద్రత కూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచంలో కేవలం 2% మందికి మాత్రమే ఆకుపచ్చ కళ్ళు ఉన్నాయి. వారి కంటిలో మెలనిన్ పరిమాణం తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. కొందరు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఎదుగుదల ప్రారంబదశలో కళ్ళ రంగు చాలా వేగంగా మారుతుంది. నీలి కళ్ళతో జన్మించినవారి కళ్లు కాలానుగుణంగా రంగు గోధుమ రంగులోకి మారడం చాలాసార్లు జరుగుతుందట.