Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు.

  • Written By:
  • Publish Date - February 11, 2023 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు. దీంతో అనేక రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా పురుషులు బయట ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల వారికీ వీర్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మరెన్నో సమస్యలు తెలెత్తుతున్నాయి. అయితే మరి వీర్యం నాణ్యత ఎలా దెబ్బతింటుంది. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే..వరికోసెల్.. వృషణాల్లోని సిరల వాపునే వరికోసెల్ అంటారు.

ఇది స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అలాగే కొన్ని రకాల అంటువ్యాధులు కూడా స్పెర్మ్ ఆరోగ్యం లేదా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. స్పెర్మ్ తగ్గడానికి దారితీస్తుంది. వీటిలో హెచ్ఐవి వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, అలాగే వృషణాల వాపు లేదా ఎపిడిడైమిస్ ఉన్నాయి. ధూమపానం లేదా మద్యపానం లేదా మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్లు వీర్యకణాల నాణ్యత, పరిమాణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మరి స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే? ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.

అలాగే సంతానోత్పత్తి పెరగడంతో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మద్యపానాన్ని తగ్గించడం, ధూమపానాన్ని మానేయడం, బరువును అదుపులో ఉంచడం వల్ల స్పెర్మ్ కౌంట్, సంతానోత్పత్తి పెరుగుతుంది.
పురుషులకు, మహిళలకు విటమిన్ డి చాలా అవసరం. ఎందుకంటే ఇది సంతానోత్పత్తి సమస్యలను తగ్గిస్తుంది. ఈ విటమిన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఒక పరిశీలనా అధ్యయనం ప్రకారం.. విటమిన్ డి లోపం ఉన్న పురుషుల్లో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు ఉండే అవకాశం ఉంది..