జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తింటూ ఉంటారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ లో ఉండే విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందట. ఇది శరీరానికి ఉన్న రక్షణ శక్తిని పెంచుతుందట. ఆరెంజ్ లోని విటమిన్ సి కంటే జామలో నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందట. అలాగే జామ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించే ఉత్తమమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒకటిగా ఉందని చెబుతున్నారు.
జామ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ ఆరోగ్యానికి సహాయపడుతుందట. ఇది జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందట. డయాబెటిస్ ఉన్నవారికి జామపండు ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు. కాగా జామ పండ్లలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుందట. అలాగే కంటి సమస్యలను దూరంగా ఉంచుతుందట. వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు తగ్గే సమస్యను నివారించేందుకు జామ జ్యూస్ ఎంతో బాగా ఉపయోగపడుతుందట.
అలాగే జామలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. జామలో ఉన్న పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయట. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి రోజూ ఒక జామ పండు తింటే సరిపోతుందని, ఒక జామ పండులో, ఒక అరటిపండులో సమానమైన పొటాషియం ఉంటుందని చెబుతున్నారు. జామలో సమృద్ధిగా ఉండే మాంగనీస్, ఆహారం నుంచి ఇతర ముఖ్యమైన పోషకాలను శరీరం బాగా గ్రహించేందుకు సహాయపడుతుందట. జామలో ఉండే మరో ముఖ్యమైన ప్రయోజనం ఫోలేట్ అనే ఖనిజం గర్భధారణకు సహాయపడుతుందట.