Site icon HashtagU Telugu

Heart Attack : వ్యాయామాలు చేసే సమయంలోనే గుండెపోటు ఎందుకొస్తోంది..!!

Heart Attack

Heart Attack

చిన్నవయస్సులోనే గుండెపోటు…ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. ఎక్కువగా వ్యాయామాలు చేస్తున్న సమయంలోనే గుండెపోటు వచ్చి మరణిస్తున్న వారికేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ట్రెడ్ మిల్ చేస్తున్న సమయంలోనే గుండపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. అంతకుముందు కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా అంతే…వ్యాయామం చేస్తూ ప్రాణాలు విడిచారు.

వాస్తవానికి గుండె కండరాల బలోపేతానికి వ్యాయామాలు మంచి చేస్తాయని చెబుతుంటారు నిపుణులు. మరి వ్యాయామం చేస్తుంటే గుండెపోటు ఎందుకు వస్తుంది. అనే సందేహం ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. వ్యాయామంతో మంచి ఫలితాలు వస్తాయనడం నిజమే కానీ….వారి ఆరోగ్య స్థితిగతులు కూడా చూసుకోవాలి. వ్యాయామం తీవ్రతపైనా ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.

ఇక రక్తసరఫరాలో ఒక్కసారిగా అడ్డంకి ఏర్పడినట్లయితే గుండెపోటుకు దారితీస్తుంది. గుండెకు రక్తాన్ని పంప్ చేసే కరోనరీ ఆర్టరీల్లో అవరోధం కలిగితే గుండెపోటు కు దారితీస్తుందని తెలుసుకోవాలి. గుండె ధమనిలో 70శాతం మేర అవరోధం కలిగితే అప్పుడు అధిక ఆక్సిజన్ అవసరపడుతుంది. ఆక్సిజన్ కు డిమాండ్ పెరగుతుంది. అదే సమయంలో ధమనిలో అవరోధం ఏర్పడటంతో హార్ట్ ఎటాక్ వస్తుంది.

ధమనుల్లో ఏర్పడిన కొవ్వు విచ్చిన్నమైతే…అది రక్తం గడ్డకడుతుంది. 30శాతం పరిమాణానికి కొవ్వు చేరినప్పుడు ఈవిధంగా జరుగుతుంది. కొవ్వు ఫలకాలుగా పేరుకపోవడానికి, పొగతాగడం, రక్తపోటు, షుగర్, ఆరోగ్యకరం కాని ఆహారం తినడం, ఒత్తిడి, తగినంత నిద్రలేకపోవడం, ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటివి గుండెపోటుకు దారితీస్తాయి. రక్తంలోని కొవ్వులు గాయంఅయిన ప్రాంతంపై గారలా పేరుకుపోతాయి. తీవ్రమైన వ్యాయామాలతో శ్రమించినప్పుడు గుండెపోటుకు దారితీస్తుంది.

ఉదయం వేళల్లోనే గుండెపోటు ఎందుకు వస్తుంది…
దానికి ఒక కారణం ఉంది. ఉదయం వేళల్లో రక్తపోటు అధికంగా ఉంటుంది. ఆ సమయంలోనే రక్తంలో గడ్డ కట్టడం వంటి సమస్య పెరుగుతుంది. తగినంత నిద్రపోనివారు, తగినంత నీరు తీసుకోనివారు తీవ్ర వ్యాయామాలు చేసేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వ్యాయామం మంచిదేనా…
ఈ సందేహం అస్సలు అవసరంలేదు. జిమ్ లో కసరత్తులు చేసేవారు ట్రెడ్ మిల్ చేసేవారు వేగంగా బ్రిస్క్ వాక్ చేసే వారు ప్రమాదానికి సంబంధించిన అంశాలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. గుండె ఇతర అవయవాల పనితీరుకుని చెక్ చేయించుకోవడం మంచిది.

Exit mobile version