చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?

50 మి.లీ ఆవనూనెను తీసుకుని, అందులో 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి నూనెలో వేసి మరిగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Ears Sound

Ears Sound

Ears Sound: చెవిలో నుంచి కట్-కట్, సన్-సన్ లేదా ఈల వేసినట్లు శబ్దాలు రావడాన్ని వైద్య పరిభాషలో టిన్నిటస్ అంటారు. జలుబు, అలర్జీ, చెవిలో గులిమి లేదా సైనస్ వంటి సమస్యల వల్ల ఇలా జరుగుతుంటుంది. ఈ సమస్యకు సంబంధించి నిపుణులు సూచించిన ఆయుర్వేద పరిష్కారాలను ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.

చెవిలో శబ్దాలు వస్తుంటే ఏం చేయాలి?

నిపుణుల‌ ప్రకారం.. చెవి సమస్యల నివారణకు జీవనశైలిలో, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

ప్రాణాయామం: ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 5 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం, 15-20 నిమిషాల పాటు కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల చెవి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఆయుర్వేద ఔషధాలు: సారివాది వటి, శిలాజిత్ రసాయన వటి ఒక్కో టాబ్లెట్ చొప్పున ప్రతిరోజూ వేడి నీటితో కలిపి తీసుకోవచ్చు.

ఆవనూనెతో అద్భుత చికిత్స

చెవిలో శబ్దాలు వచ్చే సమస్యకు ఆవనూనె ఒక గొప్ప ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది.

తయారీ విధానం: 50 మి.లీ ఆవనూనెను తీసుకుని, అందులో 10 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేయాలి. వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి నూనెలో వేసి మరిగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వాడే విధానం: వెల్లుల్లి ఎర్రగా వేగిన తర్వాత నూనెను వడకట్టాలి. ఈ గోరువెచ్చని నూనెను చెవిలో 4 చుక్కల చొప్పున వేయాలి.

Also Read: సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

చెవిలో నూనె వేయడం సరైనదేనా?

చెవిలో నూనె వేయకూడదని చాలామంది అంటుంటారు. కానీ ఆయుర్వేదం దీనిని విభేదిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం.. చెవిలో నూనె వేయడం వల్ల చెవికి సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి. అయితే ఆ నూనె పూర్తిగా స్వచ్ఛమైనది అయి ఉండాలని ఆయన హెచ్చరించారు.

చెవిలో వేయదగిన ఇతర నూనెలు

  • స్వచ్ఛమైన నువ్వుల నూనె.
  • స్వచ్ఛమైన ఆవనూనె.
  • స్వచ్ఛమైన బాదం నూనె. స్నానం చేసిన తర్వాత తలకు, చెవులకు నూనె రాయడం ఆరోగ్యానికి మంచిది.

చెవిలో శబ్దాలు రావడానికి ప్రధాన కారణాలు

అలర్జీలు: జలుబు, తుమ్ములు లేదా సైనస్ సమస్యలు ఉన్నప్పుడు చెవిలో శబ్దాలు రావచ్చు.

దవడ సమస్యలు: దవడ కీళ్లలో సమస్య ఉన్నా, పళ్లు నూరే అలవాటు ఉన్నా లేదా ఆహారం నమలడం కష్టంగా ఉన్నా చెవిలో కట్-కట్ అనే శబ్దం వస్తుంది.

చెవిలో మురికి: చెవిలో గులిమి ఎక్కువగా పేరుకుపోయి, అది ఎండిపోయి కర్ణభేరి దగ్గర చేరినప్పుడు, దవడ కదిపిన ప్రతిసారీ శబ్దం వస్తుంది.

కర్ణభేరి దెబ్బతినడం: ఒకవేళ చెవిలోని కర్ణభేరి చిరిగినా లేదా దెబ్బతిన్నా ఈల వేసినట్లు లేదా కీచురాయి శబ్దం లాంటివి వస్తుంటాయి.

  Last Updated: 27 Dec 2025, 06:45 PM IST