Pregnancy : కొంతమంది స్త్రీలకు గర్భధారణ సమయంలో ఆకలి ఎందుకు ఉండదు..!!

గర్భం అనేది ప్రతి మహిళలకు మధురమైన క్షణం. ఈ సమయంలో స్త్రీల శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 08:48 PM IST

గర్భం అనేది ప్రతి మహిళలకు మధురమైన క్షణం. ఈ సమయంలో స్త్రీల శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రీలకు వారి ఆహారం నిద్ర విధానంలో చాలా మార్పులు అవసరం. సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, తగినంత నిద్ర పొందడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. అదే సమయంలో, గర్భధారణ సమయంలో చాలా మందికి స్త్రీలకు ఆకలి వేయదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో చాలా మంది స్త్రీలకు వాంతులు అవుతుంటాయి. ఇదొక సాధారణ లక్షణం. అంతేకాదు ఆకలి కూడా ఉండదు. అయితే గర్భందాల్చిన సమయంలో మసాల, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం కొంచెం తినాలి. ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలకు ఆకలిగా అనిపించదు. తరచుగా ఒత్తిడికి గురికావడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఒత్తిడికి లోనైనప్పుడు మీకు కావాల్సిన వ్యక్తులతో మాట్లాడటం చాలా ముఖ్యం. అంతేకాదు అనోరెక్సియా, బులీమియాతో బాధపడుున్న స్త్రీలకు కూడా ఆకలి ఉండదు. ఇవి ఆహారం తినే విషయంలో ఏర్పడే రుగ్మతలు. ఇందులో ఏదైనా రుగ్మతతో మీరు బాధపడుతున్నట్లయితే…గర్భాదారణ సమయంలో ఆకలిని కోల్పోయే సమస్య ఉంటుంది. ఇలాంటి సమస్య ఎదురైతే డాక్టరును సంప్రదించాలి. ఇక హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్, హెజ్ సిజీ హార్మోన్లు పెరుగుతాయి. దీని వల్ల కూడా గర్భిణీలకు ఆకలి అనిపించదు.