Warts Tips: పులిపిర్లు ఎందుకు వస్తాయి? ఎలా పోతాయి?

పులిపిరి కాయలను ఇంగ్లీష్‌లో వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఇవి ఏర్పడతాయి.

పులిపిరి కాయలను ఇంగ్లీష్‌లో వార్ట్స్ (Warts) అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి.  చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అంటారు. పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ముఖం, మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ (Warts) అని అంటారు. కొంతమందికి జననాంగాలపై కూడా ఇవి ఏర్పడతాయి. వాటిని జనైటల్ వార్ట్స్ అని పిలుస్తారు.

వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో..

రోగ నిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వంటివి చేయకూడదు. ఇవి ఎక్కువగా రాపిడిగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. ఇంటి చిట్కాలు లేదా వైద్యులను సంప్రదించి వీటిని మటుమాయం చేయొచ్చు.

పులిపిర్లు (Warts) పోగొట్టే చిట్కాలు

బంగాళదుంప తొక్కలతో స్క్రబ్‌ చేయాలి. బంగాళదుంపను జ్యూస్‌లా  చేసి పడుకునే ముందు పులిపిర్లపై రాసుకున్నా ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఆముదం నూనె తీసుకుని అందులో బేకింగ్‌ సోడా కలిపి పేస్టులా తయారుచేసి రాసుకున్నా మార్పు స్పష్టంగా చూడొచ్చు.

యాపిల్ సిడర్ వెనిగర్: దీనిలో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజులు ఇలా పూర్తిగా మాయమవుతాయి.

కలబంద: ఇందులో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే చాలు.

బేకింగ్ పౌడర్: ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.

అరటి పండు తొక్క: అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది.

వెల్లులి: చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి మంచి ఔషదం. ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు మీరు వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు.

Also Read:  Mukesh Ambani: మరో రంగంలోకి ముఖేష్ అంబానీ గ్రాండ్ ఎంట్రీ