Tongue Test : రోగి నాలుకను డాక్టర్స్ ఎందుకు చెక్ చేస్తారు.. తెలుసా ?

ఆరోగ్యం బాగా లేక మనం ఆస్పత్రికి వెళితే.. డాక్టర్ తొలుత చూసేది నాలుకనే.

Published By: HashtagU Telugu Desk
Tongue Test Health Check Up

Tongue Test : ఆరోగ్యం బాగా లేక మనం ఆస్పత్రికి వెళితే.. డాక్టర్(Doctors) తొలుత చూసేది నాలుకనే. నాలుక ఆధారంగా మన ఆరోగ్య స్థితిపై డాక్టర్ ఒక ప్రాథమిక అంచనాకు వస్తారు. ఇంతకీ ఎందుకలా ? ఆరోగ్య సమస్యల సంకేతాలు నాలుకలో(Tongue Test) ఎలా కనిపిస్తాయి ? వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

నాలుక ఇచ్చే హెల్త్ సిగ్నల్స్ 

  •  నాలుక రంగుల ఆధారంగా.. మన ఆరోగ్యం తాజా స్థితిపై డాక్టర్ ఒక అంచనాకు వస్తారు.
  • ఒకవేళ నాలుక తెల్లటి ప్యాచీతో నిండిపోతే నిర్లక్ష్యం చేయొద్దు. రోగనిరోధక వ్యవస్థ మన నోటిలోని కణజాలంపై దాడి చేసినప్పుడు నాలుక ఇలా మారుతుంటుంది. ఈ సమస్యను ‘లాసీ వైట్ ప్యాచ్ లైకైన్ ఫ్లానస్’ అంటారు. ఇది క్యాన్సర్‌గా మారే రిస్క్ కూడా ఉంటుంది.
  • నాలుక ఎర్రబడితే.. దానిపై గడ్డలు వస్తే అలర్ట్ కావాలి. అది కవాసకి వ్యాధికి సంకేతం. సాధారణంగా పిల్లల్లో ఈ తరహా సమస్య వస్తుంటుంది. కొందరిలో విటమిన్ బీ లోపం వల్ల నోట్లో నొప్పి వస్తూ నాలుక ఎర్రగా మారుతుంటుంది.
  • కొందరికి సోరియాసిస్ సమస్య వల్ల నాలుకపై పగుళ్లు ఏర్పడుతుంటాయి. నాలుకను శుభ్రంగా ఉంచుకోవడం, దాన్ని సున్నితంగా బ్రష్ చేయడం ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చు.
  • నాలుకను శుభ్రంగా ఉంచుకోకుంటే.. దానిపై నల్లటి వెంట్రుకల లాంటి పదార్థం ఏర్పడుతుంది. ధూమపానం, ఆల్కాహాల్ తీసుకునే వారిలో ఈ ప్రాబ్లమ్ తరుచుగా వస్తుంటుంది.  క్లోరెక్సిడైన్ మౌత్ వాష్ వాడటం వల్ల కూడా ఇలా నాలుకపై వెంట్రుకలు వస్తాయి.
  • నోరు నిగనిగలాడుతూ మృదువుగా మారినా డౌట్ పడాల్సిందే. పోషకాల కొరత వల్ల అలా మారిందని మీరు అర్థం చేసుకోవాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ విటమిన్లు లోపిస్తే మీ నాలుక అలా మారుతుంది.
  • మన శరీరంలోని కాలేయంలో సమస్యలు ఉంటే..  వాటి ప్రభావాలు చర్మంలో కనిపిస్తాయి.
  • మధుమేహ సమస్యన ఉంటే.. ఆ ప్రభావం చేతులు, కాళ్లలో కనిపిస్తుంది.

Also Read :Kavitha : ఎమ్మెల్సీ కవిత రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగింపు

గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని  ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.

  Last Updated: 31 Jul 2024, 02:47 PM IST