Blood And Heart: గుండె ఎంత గట్టిదో బ్లడ్ గ్రూప్ చెబుతుందట.. ఎలాగంటే?

చాలామందిని మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే తెలియదు అని చెబుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలో

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 06:45 AM IST

చాలామందిని మీ బ్లడ్ గ్రూప్ ఏంటి అంటే తెలియదు అని చెబుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఎదురవుతూనే ఉంటుంది. అత్యవసర చికిత్స సమయంలో, ఆడవాళ్లు అయితే ప్రసవం సమయంలో, అలాగే వేరే వాళ్లకు రక్తం ని దానం చేయాల్సిన సమయంలో వైద్యులు ప్రశ్నిస్తూ ఉంటారు. బ్లడ్ గ్రూపులో.. ఏ పాజిటివ్, ఏ నెగెటివ్, బీ పాజిటివ్, బీ నెగెటివ్, ఓ పాజిటివ్, ఓ నెగెటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగెటివ్ ఇలా గ్రూపులు ఉంటాయి. అయితే ఇలా బ్లడ్ గ్రూపు అన్నది వ్యక్తుల ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనలు గుర్తించాయి. అదేలా అంటే.. బ్లడ్ గ్రూప్ లో ఏ, బీ, ఓ అన్న పదాలు ఓబీవో జీన్ ను ప్రతిఫలిస్తాయి.

ఈ జీన్ మన రక్త కణాలను భిన్నంగా తయారు చేస్తుంది. దీనిని బట్టి వివిధ రక్త గ్రూపులు ఏర్పడ్డాయి. ఏబీ గ్రూపు అంటే ఏ, బీ యాంటీజెన్స్ ను వారి ఎర్ర రక్త కణాలు తయారు చేసేలా శరీర నిర్మాణం ఉంటుంది. బ్లడ్ గ్రూపుల్లో ఓ గ్రూపు ఎటువంటి యాంటీజెన్స్ ను ఉత్పత్తి చేయదు. అందువల్లే ఒక బ్లడ్ గ్రూపు వారు మిగిలిన బ్లడ్ గ్రూపుల వారికి తమ రక్తాన్ని అత్యవసరాల్లో దానంగా ఇవ్వొచ్చు. ఓ పాజిటివ్ వారు మిగిలిన అన్ని పాజిటివ్ గ్రూపుల వారికి ఇవ్వొచ్చు. ఓ నెగెటివ్ వారు అన్ని గ్రూపుల వారికి ఇవ్వొచ్చు. ఓ పాజిటివ్, నెగిటివ్ బ్లడ్ వారిని యూనివర్సల్ డోనర్ గా చెబుతారు. జనాభాలో సుమారు సగం శాతం ఓ బ్లడ్ గ్రూపు వారే ఉంటారు.

ఎర్ర రక్త కణాల్లో ప్రొటీన్లు ఉంటే వారిని పాజిటివ్ గ్రూపుగా, లేని వారిని నెగెటివ్ గా నిర్థారిస్తుంటారు. ఇలా రక్తంలో ఎందుకు వ్యత్యాసాలు? అన్న ప్రశ్నకు ఇదీ అన్న కచ్చితమైన నిర్ధారణ లేదు. హెమటాలజిస్ట్ డాక్టర్ డగ్లెస్ గుగెన్ హీమ్ ప్రకారం ఓ బ్లడ్ గ్రూపు వారు కలరాతో, టైప్ ఏ లేదా బీ బ్లడ్ గ్రూపు వారు రక్తంలో క్లాట్ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇకపోతే ఓ గ్రూపు వారితో పోలిస్తే ఏ, బీ, ఏబీ గ్రూపు వారికి హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువగా ఉంటుం. ఏ లేదా బీ గ్రూపు వారికి హార్ట్ ఎటాక్ రిస్క్ 8 శాతం ఎక్కువ. అలాగే ఏ, బీ బ్లడ్ గ్రూపు వారికి డీప్ వేన్ థ్రోంబోసిస్ వచ్చే అవకాశాలు 51 శాతం ఎక్కువని, పల్మనరీ ఎంబాలిజమ్ వచ్చే అవకాశం 47 శాతం ఎక్కువగా ఉంటుందని ఏహెచ్ఏ అధ్యయనం చెబుతోంది. టైప్ ఏ, బీ, ఏబీ బ్లడ్ గ్రూపు వారి శరీంలో వచ్చే ఇన్ ఫ్లమ్మేషన్ ఇందుకు కారణం కావచ్చని హెమటాలజిస్ట్ గుగెన్ హీమ్ తెలిపారు.