ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నువ్వు లను ఎన్నో రకాల వంటలు స్వీట తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వులతో ప్రత్యేకించి కొన్ని వంటలు కూడా చేస్తూ ఉంటారు. నువ్వులు హార్ట్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె జబ్బులు స్ట్రోక్ వంటి ముప్పు నుంచి తప్పిస్తాయి. అలాగే వీటిలో శరీరానికి కావాల్సిన కొవ్వులు, మోనో అన్‌శాచ్యురేటెట్ కొవ్వులు ఉంటాయి. అంతేకాకుండా లిగ్నన్స్, పైటోస్టెరాయిస్ వంటి సమ్మేళనాలు కూడా నువ్వుల్లో లభిస్తాయి. ఈ రెండూ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అయితే నువ్వులు మంచివే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు నువ్వులు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు నవ్వులు తినకూడదు అన్న విషయానికొస్తే..
జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు నువ్వులు తినకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల కడుపు సంబంధించిన సమస్యలు పెరుగుతాయట. నువ్వుల నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ కడుపు ఉబ్బరం మలబద్ధకం అతిసారం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉంటే మేలు అని చెబుతున్నారు.
కొందరికి అలర్జీ సమస్యలు ఉంటాయి. కాబట్టి అలర్జీలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది. దురద చర్మంపై దద్దుర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.. ఇప్పటికే అలర్జీ సమస్యతో బాధపడుతున్న వారు వీటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. తినడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయట.
గర్భిణీ స్త్రీలు నువ్వులను తినకుండా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. ఎందుకు అంటే నువ్వుల్లో వేడి చేసే గుణం ఉంది. నిజానికి గర్భం దాల్చిన తొలి నెలల్లో నువ్వుల వినియోగం మంచిది కాదట. ఇది గర్భస్రావం ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో నువ్వులు తినవద్దు.
చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య ఉన్నవారు నువ్వులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. స్థూలకాయంతో బాధపడేవారు నువ్వులను తినకుండా ఉండాలట. నువ్వుల్లో అధిక మొత్తంలో కొవ్వు, కేలరీలు ఉంటాయి. వీటి తినడం వల్ల వేగంగా బరువు పెరగుతారట..దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకుంటున్నారు వీటిని తినక పోవడమే మంచిది అని చెబుతున్నారు.
జుట్టు రాలే సమస్య ఉన్నవారు నువ్వుల్ని ఎక్కువగా తినకూడదట. నువ్వుల వినియోగం జుట్టుకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుందట. అయితే జుట్టు రాలడం అనే సమస్యతో మీరు ఇబ్బంది పడుతుంటే, నువ్వులను తినకూడదని చెబుతున్నారు. నువ్వులు వెంట్రుకల కుదుళ్లను పొడిబారేలా చేస్తాయట. దీని వల్ల జుట్టు వేగంగా రాలిపోతుందని చెబుతున్నారు. అలాగే కఫం సమస్యతో బాధపడేవారు కూడా నువ్వులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.