వేసవికాలంలో వచ్చింది అంటే చాలు అందరికీ ఇష్టమైన మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. వీటి కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. మామిడి పండ్లను కొందరు పచ్చిగా తింటే మరికొందరు బాగా మాగిన మామిడి పండుని తింటూ ఉంటారు. అయితే మామిడి పండ్లు తినడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మామిడి పండుకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా మామిడిపండు మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు.
అలాగే బయట నుంచి తెచ్చిన మామిడి పండ్లను కనీసం నీటిలో అరగంటసేపు అయినా ఉంచి ఆ తర్వాత తినడం మంచిదని చెబుతున్నారు. పచ్చి మామిడిపండు ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణ వ్యక్తులు పచ్చి మామిడి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. దీంతో, సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది.కానీ ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడి తినకూడదట. పచ్చి మామిడి తినడం వల్ల మీ సమస్యలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంటుందట. ఎందుకంటే ఇది పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. దీంతో జలుబు, దగ్గు తీవ్రం అవ్వడంతో పాటు గొంతు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే పంటి నొప్పితో బాధపడుతున్న వారు పచ్చి మామిడికాయ తినకూడదట. పచ్చి మామిడి తినడం వల్ల పంటి నొప్పి ఇంకా తీవ్రమవుతుంది. పంటి నొప్పి, సెన్పిటివిటీ, జలదరింపు వంటి వాటితో బాధపడేవారు పచ్చి మామిడి తినడం వల్ల సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలు అనగా అజిర్తి, కడుపునొప్పి,ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు పచ్చి మామిడికాయకు దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. పచ్చి మామిడిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో, దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి ఇంకా తీవ్రమవుతుందట. అంతేకాకుండా అతిసారం వచ్చే ప్రమాదం కూడా ఉందట. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, తిమ్మిర్లు, గ్యాస్ వంటి మొదలైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని,అందుకే జీర్ణసమస్యలతో బాధపడేవారు పచ్చి మామిడికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. అలాగే అలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా పచ్చి మామిడికాయ తినకపోవడం మంచిదని చెబుతున్నారు.