డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన పిస్తా గురించి మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి తినడానికి టేస్ట్ కాస్త ఉప్పగా అనిపిస్తూ ఉంటాయి. ఈ పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ కొంతమంది వీటిని మోతాదుకు మించి తింటుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. అలాగే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పుని తినకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు పిస్తాను తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పిస్తాలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, రాగి, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, విటమిన్ బి 6, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పిస్తా పప్పు తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉండవచ్చు. ఇది మన అలసటను, బలహీనతను తగ్గించి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే పిస్తాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పిస్తా గింజలను లేదా విత్తనాలను అలెర్జీ ఉన్నవారు తినకూడదని చెబుతున్నారు. పిస్తాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయట. అదేవిధంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి కూడా పిస్తాలు మంచివి కావట. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుందని, ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను కలిగిస్తుందని, కాబట్టి కిడ్నీలో రాళ్లున్నవారు వీటిని తింటే కిడ్నీలో రాళ్లు మరింత పెరుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అదేవిధంగా ఊబకాయం తగ్గాలనుకునే వారు పిస్తాలను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ తిన్నా కూడా తక్కువ మొత్తంలోనే తినాలని చెబుతున్నారు. ఎందుకంటే పిస్తాలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పిస్తాలను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. చాలా మందికి జీర్ణ సమస్యలు ఎప్పుడూ వస్తుంటాయి. ఇలాంటి వారు కూడా పిస్తాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఎండాకాలంలో పిస్తాలను ఎక్కువగా తినకూడదట. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని పెంచుతుందని, ఇలాంటి వాటిని తినడం వల్ల ఎసిడిటీ, అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయని అందుకే పిస్తాలను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు వైద్యులు. అలాగే చిన్న పిల్లలు కూడా పిస్తాలను తినకూడదు. ఎందుకంటే చాలా మంది పిల్లలు పిస్తాలను నమలకుండా అలాగే మింగేస్తుంటారు. ఇది గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది. దీనివల్ల పిల్లలకు ఊపిరిఆడదు. కాబట్టి చిన్నపిల్లలకు వీటిని తినిపించకపోవడమే మంచిది.